Breaking News

అద్భుతం.. కోమా నుంచి బయటపడిన ఆసీస్‌ దిగ్గజం

Published on Mon, 01/05/2026 - 12:03

ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ దిగ్గజం​ డేమియన్‌ మార్టిన్‌ (54) ఆరోగ్య విషయంలో అద్భుతం జరిగింది. మెనినైటిస్‌తో బాధపడుతూ ఇటీవల కోమాలోకి వెళ్లిన ఆయన.. ఆశ్చర్యకర రీతిలో కోమా నుంచి బయటపడ్డాడు. మార్టిన్‌ ఆరోగ్యం అద్భుత రీతిలో పురోగతి సాధించింది. గంట గంటకు ఇంకా మెరుగవుతున్నాడని డాక్టర్లు చెప్పారు.

మార్టిన్‌ ఆరోగ్యం ఆశ్చర్యకర రీతిలో పురోగతి సాధిస్తుండటాన్ని అతని స్నేహితుడు, ఆసీస్‌ దిగ్గజ వికెట్‌కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ 'మిరాకిల్‌'గా అభివర్ణించాడు.

గిల్లీ మాటల్లో.. గత 48 గంటల్లో మార్టిన్‌ ఆరోగ్యం ఊహించని విధంగా మెరుగు పడింది. అతని ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కోమా నుంచి బయట పడిన తర్వాత మార్టిన్‌ అసాధారణంగా స్పందిస్తున్నాడు. స్పందించడమే కాకుండా చక్కగా మాట్లాడగలుగుతున్నాడు. త్వరలోనే అతన్ని ICU నుంచి బయటకు తరలించే అవకాశం ఉంది. కాగా, గిల్‌క్రిస్ట్‌ గత కొన్ని రోజులుగా మార్టిన్‌ ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు.

అభిమానులకు కృతజ్ఞతలు
మార్టిన్‌ ఆశ్చర్యకర రీతిలో కోలుకుంటున్న నేపథ్యంలో అతని భార్య అమాండా తొలిసారి స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, క్రికెట్ సమాజం చూపిన ప్రేమ, శ్రద్ధ వల్ల మార్టిన్‌ కోలుకుంటున్నాడని అంది. మార్టిన్‌ ఆరోగ్యం కుదుటపడటంలో అందరి పాత్ర ఉందని తెలిపింది. అభిమానుల సందేశాలు, మీడియా ద్వారా వచ్చిన మద్దతు మార్టిన్‌కు బలాన్నిచ్చాయని పేర్కొంది. కష్ట సమయంలో అండగా ఉన్న వారందకీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపింది.

సొగసైన బ్యాటర్‌గా పేరొందిన డేమియన్‌ మార్టిన్‌ 1992 నుంచి 2006 మధ్యకాలంలో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. తన కెరీర్‌లో మొత్తంగా 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఆయా ఫార్మాట్లలో 4406, 5346, 120 పరుగులు సాధించాడు.

మార్టిన్‌ ఇటీవల జరిగిన బాక్సింగ్‌ డే టెస్టుకు ముందు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే అతడి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మార్టిన్‌ పూర్తిగా కోలుకునే క్రమంలో ఉన్నాడు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)