Breaking News

దబంగ్‌ ఢిల్లీ జైత్రయాత్ర

Published on Wed, 10/08/2025 - 04:08

చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో దబంగ్‌ ఢిల్లీ విజయాల పరంపర కొనసాగుతోంది. ప్రత్యర్థితో సంబంధం లేకుండా చెలరేగిపోతున్న అశు మలిక్‌ సారథ్యంలోని దబంగ్‌ ఢిల్లీ లీగ్‌లో 11వ విజయం అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో దబంగ్‌ ఢిల్లీ ‘టైబ్రేక్‌’లో 9–3తో హరియాణా స్టీలర్స్‌ను ఓడించింది. నిర్ణీత సమయంలో రెండు జట్ల స్కోర్లు 33–33తో సమం కాగా... విజేతను నిర్ణయించేందుకు ‘5 రెయిడ్స్‌’ నిర్వహించారు. 

ఇందులో ఢిల్లీ 9 పాయింట్లతో సత్తాచాటగా... స్టీలర్స్‌ 3 పాయింట్లకే పరిమితమైంది. స్టీలర్స్‌కు ఇది వరుసగా నాలుగో పరాజయం. నిర్ణీత సమయంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున అజింక్య పవార్‌ 8 పాయింట్లు సాధించగా... నీరజ్, సౌరభ్‌ చెరో 6 పాయింట్లతో రాణించారు. స్టీలర్స్‌ తరఫున శివమ్‌ పతారే 10 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 11 విజయాలు, 1 పరాజయంతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్‌’ ప్లేస్‌లో కొనసాగుతోంది. 

స్టీలర్స్‌ 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 పరాజయాలతో 12 పాయింట్లు సాధించి పట్టిక ఆరో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ 56–37 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్‌పై విజయం సాధించింది. తలైవాస్‌ తరఫున అర్జున్‌ దేశ్వాల్‌ 26 పాయింట్లతో విజృంభించగా... పట్నా పైరెట్స్‌ తరఫున అయాన్‌ 16, అంకిత్‌ 14 పాయింట్లు సాధించారు. వీరిద్దరు మినహా తక్కినవాళ్లు ఆకట్టుకోలేకపోవడంతో పైరెట్స్‌ ఓటమి తప్పలేదు. లీగ్‌లో భాగంగా బుధవారం హరియాణా స్టీలర్స్‌తో తెలుగు టైటాన్స్, యు ముంబాతో పుణేరి పల్టన్‌ తలపడనున్నాయి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)