Breaking News

దబంగ్‌ ఢిల్లీ ‘టాప్‌’ షో

Published on Sat, 10/04/2025 - 03:26

చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో దబంగ్‌ ఢిల్లీ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లో విజయం సాధించిన దబంగ్‌ ఢిల్లీ జట్టు... తిరిగి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానానికి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పోరులో దబంగ్‌ ఢిల్లీ 43–26 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ను మట్టికరిపించింది. ఢిల్లీ కెప్టెన్‌ అషు మాలిక్‌ 14 పాయింట్లతో విజృంభించగా... మిగిలినవాళ్లంతా అతడికి అండగా నిలిచారు. యూపీ యోధాస్‌ తరఫున గగన్‌ గౌడ 12 పాయింట్లతో పోరాడినా తక్కిన వాళ్ల నుంచి అతడికి సరైన సహకారం దక్కలేదు. 

ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 22 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... యోధాస్‌ 20 రెయిడ్‌ పాయింట్లు సాధించింది. అయితే ట్యాక్లింగ్‌లో సత్తాచాటిన ఢిల్లీ జట్టు 11 పాయింట్లు ఖాతాలో వేసుకోగా... యూపీ యోధాస్‌ 5 ట్యాక్లింగ్‌ పాయింట్లకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ను ఢిల్లీ జట్టు మూడుసార్లు ఆలౌట్‌ చేసింది. తాజా సీజన్‌లో 10 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 9 విజయాలు, ఒక పరాజయంతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్‌’కు చేరింది. యూపీ యోధాస్‌ 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 6 పరాజయాలతో 8 పాయింట్లు సాధించి పట్టిక తొమ్మిదో స్థానంలో ఉంది. 

శుక్రవారమే జరిగిన మరో మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ 45–33 పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్‌పై గెలుపొందింది. తలైవాస్‌ సారథి అర్జున్‌ దేశ్వాల్‌ 22 పాయింట్లతో వీరవిహారం చేశాడు. శనివారం పుణేరి పల్టన్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్, గుజరాత్‌ జెయింట్స్‌తో బెంగాల్‌ వారియర్స్‌ తలపడనున్నాయి. 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు