Breaking News

దబంగ్‌ ఢిల్లీ ‘టాప్‌’ షో

Published on Fri, 09/26/2025 - 01:33

జైపూర్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో దబంగ్‌ ఢిల్లీ తిరిగి గెలుపుబాట పట్టింది. తొలి ఆరు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన దబంగ్‌ ఢిల్లీ గత మ్యాచ్‌లో ఓడినా... వెంటనే కోలుకొని తిరిగి విజయం సాధించింది. లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన పోరులో దబంగ్‌ ఢిల్లీ 47–26 పాయింట్ల తేడాతో యు ముంబాను మట్టికరిపించింది. దబంగ్‌ ఢిల్లీ తరఫున అశు మలిక్‌ 23 పాయింట్లతో విజృంభించాడు. 

నీరజ్‌ నర్వాల్‌ 7 పాయింట్లతో అతడికి అండగా నిలిచాడు. తాజా సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన దబంగ్‌ ఢిల్లీ 7 విజయాలు, ఒక పరాజయంతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకొని తిరిగి పాయింట్ల పట్టికలో ‘టాప్‌’కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ ‘టై బ్రేకర్‌’లో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. 

నిర్ణీత సమయంలో ఇరు జట్ల పాయింట్లు 36–36తో సమం కాగా... విజేతను తేల్చేందుకు నిర్వహించిన టై బ్రేకర్‌లో యూపీ యోధాస్‌ 6–5తో బుల్స్‌ను చిత్తుచేసి ముందంజ వేసింది. యూపీ యోధాస్‌ తరఫున భవాని రాజ్‌పుత్‌ 10 పాయింట్లు  సాధించాడు. శుక్రవారం లీగ్‌లో విశ్రాంతి దినం... శనివారం జరగనున్న మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో బెంగాల్‌ వారియర్స్, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో తమిళ్‌ తలైవాస్‌ తలపడతాయి.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)