Breaking News

దబంగ్‌ ఢిల్లీ ‘పాంచ్‌ పటాకా’

Published on Fri, 09/12/2025 - 04:20

విశాఖ స్పోర్ట్స్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో దబంగ్‌ ఢిల్లీ జోరు కొనసాగుతోంది. సీజన్‌ ఆరంభం నుంచి పరాజయం ఎరగకుండా దూసుకెళ్తున్న దబంగ్‌ ఢిల్లీ వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ నెగ్గింది. గురువారం జరిగిన పోరులో దబంగ్‌ ఢిల్లీ 38–28 పాయింట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. దీంతో ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లో నెగ్గిన ఢిల్లీ 10 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

కెప్టెన్  అశు మలిక్‌ 14 పాయింట్లతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అజింక్యా పవార్, ఫజల్‌ చెరో 5 పాయింట్లతో సారథికి అండగా నిలిచారు. రెయిడింగ్‌లో ఇరు జట్లు సమంగానే నిలిచినా... ట్యాక్లింగ్‌లో ఢిల్లీ 13 పాయింట్లు సొంతం చేసుకోగా... గుజరాత్‌ 5 పాయింట్లకే పరిమితమైంది. జెయింట్స్‌ తరఫున ప్రతీక్‌ 9 పాయింట్లతో పోరాడాడు. మరో మ్యాచ్‌లో యు ముంబా 40–39 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్‌పై గెలిచింది. 

యు ముంబా తరఫున అమీర్‌ మొహమ్మద్‌ 12 పాయింట్లు, అనిల్‌ 9 పాయింట్లు సాధించారు. పట్నా తరఫున అయాన్‌ 21 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. గురువారంతో విశాఖపట్నం అంచె పోటీలు ముగియగా... నేటి నుంచి జైపూర్‌ వేదికగా టోర్నీ కొనసాగుతుంది. ఈ రోజు మ్యాచ్‌ల్లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్‌... తమిళ్‌ తలైవాస్‌తో బెంగాల్‌ వారియర్స్‌ తలపడతాయి.  

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు