Breaking News

దబంగ్‌ ఢిల్లీ మరో విజయం

Published on Sat, 10/18/2025 - 04:19

ఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో దబంగ్‌ ఢిల్లీ జట్టు ఖాతాలో మరో విజయం చేరింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న ఢిల్లీ జట్టు శుక్రవారం జరిగిన పోరులో 37–31 పాయింట్ల తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై గెలుపొందింది. ఢిల్లీ తరఫున అక్షిత్‌ ధుల్‌ 12 పాయింట్లతో సత్తా చాటగా... నవీన్‌ 6, ఫజల్‌ 5 పాయింట్లు సాధించారు. తలైవాస్‌ తరఫున అర్జున్‌ దేశ్వాల్‌ 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. 

తాజా సీజన్‌లో ఢిల్లీ 16 మ్యాచ్‌లు ఆడి 13 విజయాలు, 3 పరాజయాలతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 42–29 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ను చిత్తుచేసింది. జైపూర్‌ తరఫున అలీ సమది 13 పాయింట్లు, నితిన్‌ 11 పాయింట్లతో రాణించగా... యోధాస్‌ తరఫున సురేందర్‌ 12 పాయింట్లతో పోరాడాడు.  

గ్రూప్‌ అడుగున ఉన్న జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 51–49తో బెంగాల్‌ వారియర్స్‌పై నెగ్గింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో దబంగ్‌ ఢిల్లీ, తెలుగు టైటాన్స్‌తో పుణేరి పల్టన్, బెంగాల్‌ వారియర్స్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ఆడతాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)