Breaking News

ప్లే ఆఫ్స్‌కు దబంగ్‌ ఢిల్లీ

Published on Sat, 10/11/2025 - 04:23

చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో అదరగొడుతున్న దబంగ్‌ ఢిల్లీ ‘ప్లే ఆఫ్స్‌’ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. తద్వారా తాజా సీజన్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. సీజన్‌ ఆరంభం నుంచి తిరుగులేని ప్రదర్శన కనబరుస్తున్న దబంగ్‌ ఢిల్లీ శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. రెయిడర్లు రాణించడంతో దబంగ్‌ ఢిల్లీ 39–33 పాయింట్ల తేడాతో గుజరాత్‌పై గెలుపొందింది. దబంగ్‌ ఢిల్లీ తరఫున అక్షిత్‌ ధుల్‌ 12 పాయింట్లతో సత్తా చాటాడు. గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున హిమాన్షు 11 పాయింట్లు సాధించాడు. 

అశు మలిక్‌ గైర్హాజరీలో అక్షిత్‌ సూపర్‌ రెయిడ్‌లతో చెలరేగడంతో ఢిల్లీ విజయం ఖాయమైంది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 23 రెయిడ్‌ పాయింట్లు సాధిస్తే... జెయింట్స్‌ 16కే పరిమితమైంది. ట్యాక్లింగ్‌లో గుజరాత్‌ 15 పాయింట్లు ఖాతాలో వేసుకోగా... ఢిల్లీ 10 పాయింట్లు సాధించింది. తాజా సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 12 విజయాలు, 2 పరాజయాలతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్‌’లో నిలిచింది. 

శనివారం నుంచి పీకేఎల్‌ పోటీలు ఢిల్లీ వేదికగా జరగనుండగా... సొంతగడ్డపై అడుగుపెట్టకముందే ఢిల్లీ జట్టు ‘ప్లే ఆఫ్స్‌’ బెర్తు ఖరారు చేసుకుంది. గుజరాత్‌ జెయింట్స్‌ 13 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 9 పరాజయాలతో 8 పాయింట్లు సాధించి పట్టిక పదో స్థానంలో కొనసాగుతోంది. మరోమ్యాచ్‌లో యు ముంబా 48–29 పాయింట్ల తేడాతో బెంగాల్‌ వారియర్స్‌పై నెగ్గింది. యు ముంబా తరఫున సందీప్‌ కుమార్‌ 13, అజిత్‌ చవాన్‌ 12 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 

బెంగాల్‌ వారియర్స్‌ తరఫున దేవాంక్‌ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో యు ముంబా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా... బెంగాల్‌ వారియర్స్‌ 9వ స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా శనివారం బెంగళూరు బుల్స్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్, తమిళ్‌ తలైవాస్‌తో పుణేరి పల్టన్‌ తలపడనున్నాయి.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)