Breaking News

మ్యాచ్‌ హోరాహోరీ... పుణేరిదే విక్టరీ

Published on Mon, 10/13/2025 - 04:37

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌–12)లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరిన దబంగ్‌ ఢిల్లీ, పుణేరి పల్టన్‌ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో పుణేరి పైచేయి సాధించింది. స్కోర్లు సమమైన ఈ మ్యాచ్‌లో పల్టన్‌ జట్టు ‘టైబ్రేక్‌’ రెయిడ్‌లతో గెలుపొందింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే పోటాపోటీగా సాగింది. దీంతో నిరీ్ణత సమయం ముగిసేసరికి 38–38తో స్కోరు సమమైంది. పుణేరి రెయిడర్లలో పంకజ్‌ (7), ఆదిత్య షిండే (6), మోహిత్‌ (5) క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టారు. 

ఆల్‌రౌండర్, కెపె్టన్‌ అస్లామ్‌ ఇనామ్‌దార్‌ (6)తో పాటు, డిఫెండర్‌ గౌరవ్‌ ఖత్రి (4) కూడా రాణించాడు. దబంగ్‌ తరఫున రెయిడర్‌ అజింక్య పవార్‌ 10 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో డిఫెండర్‌ సౌరభ్‌ (6), ఆల్‌రౌండర్‌ నవీన్‌ (5), నీరజ్‌ నర్వాల్‌ (4) అదరగొట్టారు. మ్యాచ్‌ విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన టైబ్రేక్‌లో పుణేరి రెయిడర్లు అందరూ పాయింట్లు తెచ్చిపెట్టడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఈ విజయంతో పట్టికలో టాప్‌–2 స్థానాలు తారుమారు అయ్యాయి. 

అగ్రస్థానంలో ఉన్న దబంగ్‌ రెండో స్థానానికి, రెండో స్థానంలో ఉన్న పుణేరి పల్టన్‌ అగ్రస్థానానికి ఎగబాకింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 43–32తో బెంగాల్‌ వారియర్స్‌పై గెలిచింది. ఆల్‌రౌండర్‌ అలీ రెజా (18) చెలరేగాడు. రెయిడింగ్‌లో 16 పాయింట్లు, టాకిల్‌తో 2 పాయింట్లు తెచ్చిపెట్టాడు. 

మిగతా సహచరుల్లో రెయిడర్‌ ఆశిష్‌ మలిక్‌ (7), డిఫెండర్‌ దీపక్‌ శంకర్‌ (6)సైతం పోటీపడి పాయింట్లు తెచ్చారు. బెంగాల్‌ జట్టు రెయిడర్లలో కెపె్టన్‌ దేవాంక్‌ (13), హిమాన్షు నర్వాల్‌ (7) రాణించారు. నేడు జరిగే పోటీల్లో పట్నా పైరేట్స్‌తో హరియాణా స్టీలర్స్, యూ ముంబాతో యూపీ యోధాస్‌ తలపడతాయి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)