Breaking News

భారత వెయిట్‌లిఫ్టర్‌ సంజితకు భారీ షాక్‌.. నాలుగేళ్ల నిషేధం

Published on Tue, 04/04/2023 - 13:01

CWG Champion Sanjita Chanu: భారత వెయిట్‌లిఫ్టర్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ చాంపియన్‌ సంజితా చానుకు నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(ఎన్‌ఏడీఏ) గట్టి షాకిచ్చింది. డోపింగ్‌ టెస్టులో విఫలమైన ఆమెపై నాలుగేళ్లు పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని భారత వెయిట్‌లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌(ఐడబ్ల్యూఎఫ్‌) అధ్యక్షుడు సహదేవ్‌ యాదవ్‌ ధ్రువీకరించినట్లు వార్తా సంస్థ పీటీఐ మంగళవారం వెల్లడించింది.

కాగా నాడా నిర్ణయంతో సంజితాకు భారీ షాక్‌ తగలనుంది. జాతీయ క్రీడల్లో వెండి పతకం గెలిచిన ఆమె నుంచి మెడల్‌ వెనక్కి తీసుకోనున్నారు. ఇక గతేడాది నిర్వహించిన డోపింగ్‌ టెస్టులో సంజిత పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌లో నిషేధిత అనబాలిక్‌ స్టెరాయిడ్‌ డ్రొస్టానొలోన్‌ మెటాబొలైట్‌ ఆనవాలు లభించింది. నేషనల్‌ గేమ్స్‌ సందర్భంగా ఈ టెస్టు నిర్వహించారు.

అయితే, ఆ సమయంలో 49 కేజీల విభాగంలో పోటీపడ్డ సంజిత రజతం గెలిచింది. ఇప్పుడు ఆమెను దోషిగా తేలుస్తూ నాడా నిషేధం విధించడంతో ఆమె పతకాన్ని కోల్పోనుంది. అంతేగాక నాలుగేళ్ల పాటు నిషేధం ఎదుర్కొననుంది. కాగా గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2014లో 48 కేజీల విభాగంలో సంజిత స్వర్ణం గెలిచింది. 2018లో గోల్డ్‌కోస్ట్‌ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. కాగా తనపై నిషేధం నేపథ్యంలో సంజితా చాను ఇంతవరకు స్పందించలేదు.

చదవండి:  సన్‌రైజర్స్‌కు గుడ్‌న్యూస్‌.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! ఇక తిరుగుండదు

Videos

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)