Breaking News

కాంస్యంతో సరిపెట్టుకున్న శ్రీకాంత్‌.. సింధుకు ‘స్వర్ణా’వకాశం

Published on Mon, 08/08/2022 - 07:05

కామన్వెల్త్‌ గేమ్స్‌లో తెలుగు తేజం సింధు ఖాతాలో సింగిల్స్‌ విభాగం పసిడి పతకమే బాకీ ఉంది. గత ఈవెంట్‌లో స్వర్ణం గెలిచినప్పటికీ అది మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో వచ్చింది. సింగిల్స్‌లో గ్లాస్గో (2014) లో కాంస్యం, గోల్డ్‌కోస్ట్‌ (2018)లో రజతం నెగ్గిన ఆమెకు ఇప్పుడు స్వర్ణావకాశం మళ్లీ వచ్చింది. బర్మింగ్‌హామ్‌ ఈవెంట్‌లో సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆమె 21–19, 21–17తో యో జియా మిన్‌ (సింగపూర్‌)పై గెలిచి తుదిపోరుకు అర్హత సంపాదించింది.

పురుషుల సింగిల్స్‌లో స్టార్‌ లక్ష్య సేన్‌ కూడా పసిడి వేటకు సిద్ధమవగా... కిడాంబి శ్రీకాంత్‌ కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతక మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 21–15, 21–18తో జియా హెంగ్‌ తె (సింగపూర్‌)పై గెలుపొందాడు. శ్రీకాంత్‌ కాంస్యంతో భారత పతకాల సంఖ్య 51కి  చేరింది. సెమీఫైనల్లో లక్ష్య సేన్‌ 21–10, 18–21, 21–16తో జియా హెంగ్‌ టె (సింగపూర్‌)పై గెలుపొందగా, శ్రీకాంత్‌ 21–13, 19–21, 10–21తో తే యంగ్‌ ఎంజ్‌ (మలేసియా) చేతిలో ఓడాడు.

పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టి జోడీ 21–6, 21–15తో చెంగ్‌ పెంగ్‌ సున్‌–టియాన్‌ కియన్‌ మెన్‌ (మలేసియా) జంటపై గెలిచి పసిడి పోరుకు సిద్ధమైంది. మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట 13–21, 18–21తో తాన్‌ కూంగ్‌ పియర్లీ–థినా మురళీధరన్‌ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయి కాంస్య పతకం బరిలో నిలిచింది.    

Videos

Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

Photos

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)