Breaking News

CWG 2022: మరో మూడు పతకాలు ఖాయం చేసిన భారత అథ్లెట్లు

Published on Wed, 08/03/2022 - 18:45

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేటలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే (ఆరో రోజు) భారత్‌ ఖాతాలో 14 పతకాలు చేరగా, మరో 3 పతకాలు జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌ల్లో భారత అథ్లెట్లు ఓడినప్పటికీ కనీసం ఓ రజతం, రెండు కాంస్య పతకాలు భారత్‌ ఖాతాలో చేరనున్నాయి. మహిళల జూడో 78 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన తులికా మాన్‌ సిల్వర్‌ మెడల్‌పై కర్చీఫ్‌ వేయగా.. పురుషుల బాక్సింగ్‌ 57 కేజీల విభాగంలో హుసముద్దీన్‌ ముహమ్మద్‌ కనీసం కాంస్యం, మహిళల 45-48 కేజీల విభాగంలో నీతు మరో కాంస్యాన్ని ఖరారు చేశారు. 

ఇదిలా ఉంటే, కామన్‌వెల్త్‌ క్రీడల ఆరో రోజు లవ్‌ప్రీత్‌ సింగ్‌ కాంస్యం సాధించడంతో భారత్‌ పతకాల సంఖ్య 14కు చేరింది. ఒక్క వెయిట్‌ లిఫ్టింగ్‌లోనే భారత్‌ 9 పతకాలు సాధించడం విశేషం. మిరాబాయ్‌ చాను (గోల్డ్‌), జెరెమీ లాల్‌రిన్నుంగ (గోల్డ్‌), అచింట షెవులి (గోల్డ్‌), సంకేత్‌ సర్గార్ (సిల్వర్‌), బింద్యా రాణి (సిల్వర్‌), వికాస్‌ ఠాకుర్‌ (సిల్వర్‌), గురురాజ పుజారి (బ్రాంజ్‌), హర్జిందర్‌ కౌర్‌ (బ్రాంజ్‌), లవ్‌ప్రీత్‌ సింగ్‌ బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించారు. మిగతా ఐదు పతకాల్లో జూడోలో 2 (సుశీలా దేవీ సిల్వర్‌, విజయ్‌ కుమార్‌ యాదవ్‌ బ్రాంజ్‌), లాన్స్‌ బౌల్స్‌‌లో ఒకటి (గోల్డ్‌), టేబుల్‌ టెన్నిస్లో ఒకటి (గోల్డ్‌)‌, బ్యాడ్మింటన్‌లో ఒకటి (సిల్వర్‌) గెలిచారు. 

ఇక పతకాల పట్టిక విషయానికొస్తే.. 5 స్వర్ణాలు , 5 రజతాలు, 4 కాంస్య పతకాలు సాధించిన భారత్‌ ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. 106 పతకాలతో (42 గోల్డ్‌, 32 సిల్వర్‌, 32 బ్రాంజ్‌) ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ 86 (31 గోల్డ్‌, 34 సిల్వర్‌, 21 బ్రాంజ్), న్యూజిలాండ్‌ 26 (13 గోల్డ్‌, 7 సిల్వర్‌, 6 బ్రాంజ్), కెనడా 46 (11 గోల్డ్‌, 16 సిల్వర్‌, 19 బ్రాంజ్), సౌతాఫ్రికా 16 (6 గోల్డ్‌, 5 సిల్వర్‌, 5 బ్రాంజ్) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో నిలిచాయి.  
చదవండి: కంటతడి పెట్టిన కిదాంబి శ్రీకాంత్‌.. స్వర్ణం చేజారాక తీవ్ర భావోద్వేగం

Videos

నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు.. బాలినేనిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే దామచర్ల

జగన్ ఫోటో తొలగింపు.. టీడీపీ నేతలపై గోరంట్ల మాధవ్ ఫైర్

25 వేల మంది ఆధారపడి ఉన్నారు వాళ్ల కుటుంబాల పరిస్థితి ఏంటి

హార్వర్డ్ యూనివర్సిటీపై మరోసారి ట్రంప్ సర్కారు కొరడా

టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గు పడుతున్న.. బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

మై డియర్ డాడీ.. కేసీఆర్ కు కవిత సంచలన లేఖ

Big Question: బాబుకు బాదుడే బాదుడు.. అతిపెద్ద కుంభకోణం

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)