ఈ మెక్‌ముల్లెన్‌ మెక్‌కల్లమ్‌ కంటే డేంజర్‌లా ఉన్నాడు.. శతక్కొట్టి చుక్కలు చూపించాడు

Published on Sun, 06/25/2023 - 15:38

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో భాగంగా ఒమన్‌తో జరుగుతున్న గ్రూప్‌-బి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ యువ ఆటగాడు బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మెక్‌ముల్లెన్‌ 92 బంతుల్లోనే శతక్కొట్టి, ఒమన్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీ తర్వాత మరింత వేగంగా ఆడిన మెక్‌ముల్లెన్‌ 121 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 136 పరుగులు చేసి ఔటయ్యాడు.

బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ పేరు హిట్టింగ్‌ దిగ్గజం, న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ పేరుకు దగ్గరగా ఉండటం, మెక్‌కల్లమ్‌ తరహాలో మెక్‌ముల్లెన్‌ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడటం చూసి నెటిజన్లు ఈ స్కాటిష్‌ హిట్టర్‌ను మెక్‌కల్లమ్‌తో పోలుస్తున్నారు. ఈ మెక్‌ముల్లెన్‌ మెక్‌కల్లమ్‌ కంటే డేంజర్‌లా ఉన్నాడంటూ కితాబిస్తున్నారు. పైగా మెక్‌ముల్లెన్‌ బౌలింగ్‌లోనూ ఇరగదీశాడంటూ ప్రశంసిస్తున్నారు. కాగా, 23 ఏళ్ల మెక్‌ముల్లెన్‌.. స్కాట్లాండ్‌ తరఫున 11 వన్డేల్లో సెంచరీ, హాఫ్‌ సెంచరీ సాయంతో 326 పరుగులు చేసి.. బౌలింగ్‌లో ఓసారి 5 వికెట్ల ఘనతతో 17 వికెట్లు పడగొట్టాడు. 

ఇదిలా ఉంటే, బులవాయో వేదికగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌.. నిర్ణీత ఓవర్లలో 320 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ (136) సూపర్‌ సెంచరీతో ఇరగదీయగా.. కెప్టెన్‌ రిచీ బెర్రింగ్టన్‌ (60) అర్ధసెంచరీతో రాణించాడు. ఒమన్‌ బౌలర్లలో బిలాల్‌ ఖాన్‌ 5 వికెట్లు పడగొట్టగా.. ఫయాజ్‌ బట్‌ 2, జే ఒడేడ్రా ఓ వికెట్‌ పడగొట్టారు.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)