Breaking News

నెదర్లాండ్స్‌ను గెలిపించిన ఆంధ్ర క్రికెటర్‌

Published on Thu, 06/22/2023 - 20:32

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో నెదర్లాండ్స్‌ బోణీ కొట్టింది. యూఎస్‌ఏతో ఇవాళ (జూన్‌ 22) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆంధ్ర (విజయవాడ) క్రికెటర్‌ తేజ నిడమనురు బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో (68 బంతుల్లో 58; 5 ఫోర్లు), కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (60 బంతుల్లో 67 నాటౌట్‌; 6 ఫోర్లు) అజేయమైన అర్ధసెంచరీతో నెదర్లాండ్స్‌ను విజయతీరాలకు చేర్చారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఎస్‌ఏ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 211 పరుగుల నామమాత్రపు స్కోర్‌ చేసింది. షాయాన్‌ జహంగీర్‌ (71) అర్ధసెంచరీతో రాణించగా.. గజానంద్‌ సింగ్‌ (33), జెస్సీ సింగ్‌ (38) పర్వాలేదనిపించారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో ర్యాన్‌ క్లీన్‌, బాస్‌ డి లీడ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. వాన్‌ బీక్‌, ఆర్యన్‌ దత్‌, క్లేటన్‌ ఫ్లాయిడ్‌, విక్రమ్‌జిత్‌ సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ టీమ్‌.. 83 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. తేజ, కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ ఆ జట్టును గెలిపించారు. మ్యాక్స్‌ ఓడౌడ్‌ (26), వెస్లీ బర్రెసీ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. యూఎస్‌ఏ బౌలర్లలో జస్‌దీప్‌ సింగ్‌ 2, సౌరభ్‌ నేత్రావాల్కర్‌, అలీ ఖాన్‌, నోష్‌తుష్‌ కెంజిగే తలో వికెట్‌ పడగొట్టారు.

ఈ గెలుపుతో గ్రూప్‌-ఏలో నెదర్లాండ్స్‌ మూడో ప్లేస్‌కు (2 మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, మరో ఓటమి) చేరగా..  3 మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓటమిపాలైన యూఎస్‌ఏ టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లైంది. ఈ గ్రూప్‌ నుంచి ఆడిన 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన వెస్టిండీస్‌, జింబాబ్వే తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ఇవాళ విండీస్‌ చేతిలో ఓడిన నేపాల్‌ నాలుగో స్థానంలో నిలిచింది. 

గ్రూప్‌-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఒమన్‌ (2 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) టాప్‌లో ఉండగా.. శ్రీలంక (2), స్కాట్లాండ్‌ (2), ఐర్లాండ్‌ (0), యూఏఈ (0) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచాయి. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరే రెండు జట్లు ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)