Breaking News

పదేళ్ల నుంచి ఇంతే.. ఆశలు రేకెత్తిస్తారు, ఆఖర్లో ఉసూరుమనిపిస్తారు..!

Published on Mon, 11/20/2023 - 16:48

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్‌కు చేరిన భారత్‌.. ఆఖరి మెట్టుపై (ఫైనల్స్‌) బోల్తా పడి 140 కోట్ల మంది భారతీయులకు గుండెకోత మిగిల్చింది. సెమీస్‌ లేదా ఫైనల్స్‌లో ఇలా చేతులెత్తేయడం భారత్‌కు ఇది కొత్తేమీ కాదు. గత పదేళ్ల కాలంలో టీమిండియా తొమ్మిది ఐసీసీ టోర్నీల్లో సెమీస్‌ లేదా ఫైనల్స్‌లో ఓటమిపాలైంది. 

ఐసీసీ టోర్నీల్లో భారత్‌ వరుస వైఫల్యాల తీరును పరిశీలిస్తే.. ఆయా టోర్నీల ఆరంభాల్లో చిచ్చరపిడుగుల్లా చెలరేగిపోయే భారత క్రికెటర్లు నాకౌట్‌ మ్యాచ్‌ అనగానే ఒత్తిడికి లోనై చతికిలపడతారు. 2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో ఇదే తంతు కొనసాగుతుంది. వరల్డ్‌కప్‌ 2023లోనూ సెమీస్‌ వరకు ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఆటగాళ్లు ఫైనల్‌ మ్యాచ్‌లో చేతులెత్తేశారు. 

ఎన్నో అంచనాల నడుమ ఫైనల్‌ మ్యాచ్‌ బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో స్థాయికి తగ్గట్టుగా ఆడలేక ఓడారు. ఆశలు రేకెత్తించి, ఆఖర్లో ఊసూరుమనిపించడం టీమిండియా ఆటగాళ్లకు పరిపాటిగా మారింది. ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకోని టీమిండియా నెక్స్ట్‌ టైమ్‌ బెటర్‌ లక్‌ అంటూ సర్ధి చెప్పుకోవడం తప్పించి చేసిందేమీ లేదు. 

అభిమానులు సైతం​ ఇదే అనుకుంటూ ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తుండటంతో వారిలో సీరియస్‌నెస్‌ కొరవడింది. విచ్చలవిడిగా డబ్బు, పబ్లిసిటీ లభిస్తుండటంతో వాటిపైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టే భారత క్రికెటర్లు ఇకనైనా అలసత్వం వీడాలి. లేకపోతే నెక్స్ట్‌ జనరేషన్‌ కూడా గెలుపును అంత సీరియస్‌గా తీసుకోదు. ఒత్తిడిలో ఎలా ఆడాలో ఆసీస్‌ ఆటగాళ్ల నుంచి మనవాళ్లు ఎంతైనా నేర్చుకోవాలి. ప్రతిభ గల జట్టును బెంచ్‌ మార్క్‌గా పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. అభిమానులకు ఇది కాస్త ఇబ్బందికరంగానే ఉండవచ్చు కానీ అనక తప్పదు.

2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ప్రస్తానం..

  • 2014 టీ20 వరల్డ్‌కప్‌: ఫైనల్లో ఓటమి
  • 2015 వన్డే వరల్డ్‌కప్‌: సెమీస్‌లో ఓటమి
  • 2016 టీ20 వరల్డ్‌కప్‌: సెమీస్‌లో ఓటమి
  • 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ: ఫైనల్స్‌లో ఓటమి
  • 2019 వన్డే వరల్డ్‌కప్‌: సెమీస్‌లో ఓటమి
  • 2021 వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌: ఫైనల్లో ఓటమి
  • 2022 టీ20 వరల్డ్‌కప్‌: సెమీఫైనల్లో ఓటమి
  • 2023 వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌: ఫైనల్లో ఓటమి
  • 2023 వన్డే వరల్డ్‌కప్‌: ఫైనల్లో ఓటమి

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)