Breaking News

ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాం.. మాకూ విజయావకాశాలు వచ్చాయి: సౌతాఫ్రికా కెప్టెన్‌

Published on Fri, 11/17/2023 - 12:41

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేస్తూ తక్కువ స్కోర్‌ (212) చేసినప్పటికీ.. ఆసీస్‌కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయలేదు. ప్రొటిస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి 7 వికెట్లు పడగొట్టడమే కాకుండా 48వ ఓవర్‌ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లారు. ఆఖర్లో కమిన్స్‌ (14 నాటౌట్‌), స్టార్క్‌ (16 నాటౌట్‌) బాధ్యతాయుతంగా ఆడి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ఆసీస్‌ ఎనిమిదో సారి ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరింది. ఆసీస్‌ చేతిలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా ఐదోసారి సెమీస్‌ గండాన్ని దాటలేక ఇంటిబాట పట్టింది.

మ్యాచ్‌ అనంతరం లూజింగ్‌ కెప్టెన్‌ టెంబా బవుమా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మరోసారి సెమీస్‌లో ఓడినందుకు బాధగా ఉంది. మాటల్లో చెప్పలేను. ముందుగా ఆస్ట్రేలియాకు అభినందనలు. ఫైనల్‌ కోసం వారికి శుభాకాంక్షలు. వారు ఈ రోజు అద్భుతంగా ఆడారు. మేము బ్యాట్‌తో, బంతితో ప్రారంభించిన విధానం బాగా లేదు. అక్కడే మ్యాచ్‌ను కోల్పోయాం. పరిస్థితులకు వారి నాణ్యమైన బౌలింగ్‌ అటాక్‌ తోడైంది. దీంతో వారు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశారు.

24 పరుగులకే 4 వికెట్లు కోల్పోతే భారీ స్కోర్‌ సాధించడం చాలా కష్టం. అయినా మిల్లర్ (101), క్లాసెన్ (47) అద్భుతంగా ఆడి ఫైటింగ్‌ టోటల్‌ను ఇచ్చారు. వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో మిల్లర్‌ ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఛేదనలో ఆసీస్‌కు మంచి ఆరంభం లభించింది. అదే మా కొంపముంచింది. మార్క్రమ్, మహారాజ్ అద్భుతంగా బౌలింగ్‌ చేసి వారిని ఒత్తిడిలోకి నెట్టారు. మాకూ అవకాశాలు వచ్చాయి.

అయితే మేము వాటిని ఒడిసిపట్టుకోలేకపోయాం. కొయెట్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడో యోధుడు. ఇతర సీమర్లతో కాని పనిని కొయెట్జీ ఈ రోజు చేసి చూపించాడు. అతడు తీసిన స్మిత్ వికెట్ నమ్మశక్యంగా లేదు. క్వింటన్  టైటిల్‌ గెలచి కెరీర్‌ ముగించాలని కోరుకున్నాడు. దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ఫలితం ఎలా ఉన్నా డికాక్‌ దక్షిణాఫ్రికా క్రికెట్‌ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచిపోతాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)