Breaking News

SA VS PAK: ఇరగదీస్తున్న జన్సెన్‌.. సౌతాఫ్రికా కల నెరవేరుస్తాడా..?

Published on Fri, 10/27/2023 - 16:02

ప్రస్తుత ప్రపంచకప్‌లో నామమాత్రపు అంచనాలతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు.. అంచనాలకు మించి రాణిస్తూ (నెదర్లాండ్స్‌ చేతిలో పరాజయం మినహా) భారీ విజయాలతో దూసుకుపోతుంది. ప్రస్తుత ఎడిషన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో భారత్‌ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది. 

పాయింట్ల ప్రకారం చూస్తే.. సౌతాఫ్రికా కంటే ఒటమి ఎరుగని భారత్‌ మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ, రన్‌రేట్‌ విషయంలో సౌతాఫ్రికా ఏ జట్టుకు అందనంత ఎత్తులో ఉంది. ఆ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించడంతో 2.370 రన్‌రేట్‌ కలిగి ఉంది. ప్రస్తుతానికి ఏ జట్టుకు ఈ స్థాయి రన్‌రేట్‌ లేదు.

ఈ ఎడిషన్‌లో సౌతాఫ్రికా ఇంతటి భారీ విజయాలు సాధించడంలో డికాక్‌, క్లాసెన్‌, మార్క్రమ్‌, డస్సెన్‌ కనిపించే హీరోలయితే (సెంచరీలు సాధించి).. కనిపించని హీరో మరొకరు ఉన్నారు. అతడే మార్కో జన్సెన్‌. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి తన పని తాను చేసుకుపోతున్న జన్సెన్‌.. ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్‌లో వికెట్లు కూడా తీసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 

ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు (పాక్‌తో మ్యాచ్‌ కలుపుకుని) ఆడిన జన్సెన్‌ 61.50 సగటున 123 పరుగులు చేయడంతో పాటు 12 వికెట్లు పడగొట్టి అసలుసిసలు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా మారాడు. 

సౌతాఫ్రికా కల నెరవేరుస్తాడా..?
ప్రస్తుత ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ఉన్నట్లుండి హాట్‌ ఫేవరెట్‌ జట్టుగా మారిపోయింది. ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ లాంటి అగ్రశ్రేణి జట్లు చిన్న జట్ల చేతుల్లో పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో సఫారీలకు ఒక్కసారిగా క్రేజ్‌ పెరిగిపోయింది. భారత్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో పాటు ఈ జట్టు వరల్డ్‌కప్‌ రేసులోకి దూసుకువచ్చింది. నెదర్లాండ్స్‌ చేతిలో పరాభవానికి కుంగిపోకుండా, ఆ జట్టు కనబరుస్తున్న పోరాటపటిమ అందరిని ఆకట్టుకుంటుంది. 

ఈ పరిస్థితుల్లో జన్సెన్‌ లాంటి పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ సౌతాఫ్రికాకు అదనపు బలంలా మారాడు. అతడు ప్రతి మ్యాచ్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణిస్తూ మ్యాచ్‌ విన్నర్‌లా తయారయ్యాడు. తదుపరి మ్యాచ్‌ల్లో జన్సెన్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా ఇదే తరహాలో రాణిస్తే, చాలా ఏళ్లుగా వరల్డ్‌కప్‌ గెలవాలన్న సౌతాఫ్రికా కల ఈసారి నెరవేరే అవకాశం ఉంది.  

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)