Breaking News

CWC 2023 SA VS SL: సెంచరీలతో డబుల్‌ సెంచరీ కొట్టిన డికాక్‌, డస్సెన్‌

Published on Sat, 10/07/2023 - 20:33

సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 7) జరుగుతున్న వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో సెంచరీల మోత మోగింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు.

క్వింటన్‌ డికాక్‌ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్‌ మార్క్రమ్‌  (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్‌ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది.

కాగా, ఈ మ్యాచ్‌లు అత్యధిక టీమ్‌ స్కోర్‌ నమోదు కావడంతో పాటు పలు ఇతర రికార్డులు కూడా నమోదయ్యాయి. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్‌ హండ్రెడ్‌ (మార్క్రమ్‌- 49 బంతుల్లో), వరల్డ్‌కప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు శతక్కొట్టడం.. ఇలా సౌతాఫ్రికా, ఆ జట్టు ఆటగాళ్లు పలు రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. 

ఈ రికార్డులతో పాటు డికాక్‌, డస్సెన్‌లు మూడు వేర్వేరు ఘనతలను సాధించి, రికార్డుపుటల్లోకెక్కారు. అవేంటంటే.. ఈ మ్యాచ్‌లో డికాక్‌ చేసిన సెంచరీ వన్డేల్లో వికెట్‌కీపర్‌లు చేసిన 200వ సెంచరీగా రికార్డైంది.

ఈ సెంచరీ వన్డేల్లో సౌతాఫ్రికా తరఫున కూడా 200వ సెంచరీ కావడం విశేషం. 

ఇదే మ్యాచ్‌లో డస్సెన్‌ చేసిన సెంచరీ వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీల్లో 200వ శతకంగా నమోదైంది. ఇలా డికాక్‌, డస్సెన్‌ చేసిన సెంచరీలతో డబుల్‌ సెంచరీని మార్కును తాకారు.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా నిర్ధేశించిన కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. 21 ఓవర్లలో 154 పరుగులు చేసి సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. షకన (3), అసలంక​ (28) క్రీజ్‌లో ఉన్నారు. లంక ఇన్నింగ్స్‌లో నిస్సంక (0), కుశాల్‌ పెరీరా (7), ధనంజయ డిసిల్వ (11), సమరవిక్రమ (23) విఫలం కాగా.. కుశాల్‌ మెండిస్‌ క్రీజ్‌లో ఉన్నంతసేపు విధ్వంసం (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) సృష్టించాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)