Breaking News

CWC 2023: పాపం మతీష పతిరణ! జూనియర్‌ మలింగగా పేరొచ్చినా... 

Published on Wed, 10/11/2023 - 09:04

శ్రీలంక యువ పేసర్ మతీష‌ పతిరణకు ప్రపంచకప్‌ 2023 అంతగా అచ్చిరావడం లేదనిపిస్తోంది. ఆడింది రెండు మ్యాచ్‌లే కానీ... సమర్పించుకున్న పరుగులు మాత్రం 180కిపైగానే. పోనీ వికెట్లయినా ఎక్కువ తీశాడా? ఊహూ అదీ లేదు. రెండు మ్యాచ్‌లలోనూ చెరో వికెట్‌ మాత్రమే దక్కింది. దీంతో టోర్నీలోనే అత్యంత ధారాళంగా పరుగులిచ్చిన బౌలర్‌గా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. 

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో  మొత్తం పది ఓవర్లలో 95 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీసిన పతిరణ నిన్నటి పాకిస్తాన్‌ మ్యాచ్‌లోనూ ధారాళంగా పరుగులిచ్చాడు. తొమ్మిది ఓవర్లలో ఒక వికెట్‌ తీసి 90 పరుగులు సమర్పించుకున్నాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో డికాక్‌, డస్సెన్‌, మార్క్రమ్‌ పతిరణకు బౌలింగ్‌లో పరుగుల వరద పారిస్తే... పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అబ్దుల్లా షఫీక్‌, మొహమ్మద్‌ రిజ్వాన్‌ అతని బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు. 

ఈ వరుస దారుణ ప్రదర్శనల నేపథ్యంలో లంక జట్టులో పతిరణ స్థానం ​ప్రశ్నార్ధకంగా మారింది. ఒక రకంగా అతడి కెరీరే ప్రమాదంలో పడిందని చెప్పాలి. బౌలింగ్‌ కట్టుదిట్టం చేసుకోకుంటే కేవలం బౌలింగ్‌ యాక్షన్‌ ద్వారా జూనియర్‌ మలింగగా పొందిన పేరు కూడా అతడి కెరీర్‌ను కాపాడలేదని విశ్లేషకులు అంటున్నారు. 

యువ బౌలర్‌....
ఇరవై ఏళ్ల పతిరణ కెరీర్‌లో ఇప్పటివరకూ 12 వన్డేలు, ఓ టీ20 ఆడాడు. మొత్తం 17 వికెట్లు పడగొట్టాడు. తన స్వల్ప వన్డే కెరీర్‌లో 7.28 సగటున పరుగులు సమర్పించుకుని భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. ఐపీఎల్‌లో సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నా... తగినన్ని వికెట్లు తీసుకోవడంతో మంచి బౌలర్‌ అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ... మున్ముందు పతిరణ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. 

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ శ్రీలంకపై చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లంక నిర్దేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి ప్రపంచకప్‌లో 300కు పైగా లక్ష్యాన్ని చేధించిన తొలి జట్టుగా పాకిస్తాన్‌ చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్‌ మొదలుపెట్టిన తరువాత 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న పాక్‌ను మొహమ్మద్‌ రిజ్వాన్‌ (131 నాటౌట్‌), అబ్దుల్లా షఫీక్‌ (113)లు తమ సూపర్‌ సెంచరీలతో గెలిపించారు. అంతకుముందు కుశాల్‌ మెండిస్‌ (122), సమర విక్రమ (108) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)