Breaking News

శతాబ్దంలో ఒక్కటీ గెలవలేదు.. ఈ మ్యాచ్‌లోనైనా సౌతాఫ్రికా చరిత్ర తిరగరాస్తుందా..?

Published on Fri, 10/27/2023 - 13:31

సౌతాఫ్రికా-పాకిస్తాన్‌ జట్ల మధ్య చెన్నై వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 27) కీలక సమరం జరుగనుంది. ప్రస్తుత ఎడిషన్‌లో హ్రాటిక్‌ పరాజయాలు, చివరి మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో ఘోర పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం కానుంది. మరోవైపు సౌతాఫ్రికా ఈ టోర్నీలో భారీ విజయాలతో దూసుకుపోతూ, పాయింట్ల పట్టికలో భారత్‌ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది. నెదర్లాండ్స్‌ చేతిలో ఊహించని షాక్‌ మినహాయించి, ప్రస్తుత ఎడిషన్‌లో సౌతాఫ్రికా పరిస్థితి పాక్‌తో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింట భారీ విజయాలు సాధించి, భారత్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ కలిగి ఉంది. 

పాక్‌దే పైచేయి..
వన్డే ప్రపంచకప్‌లో పాక్‌-సౌతాఫ్రికాల మధ్య ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్‌లు జరగ్గా.. సౌతాఫ్రికా మూడు, పాక్‌ రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.

ఈ శతాబ్దంలో ఒక్కటీ గెలవలేదు..
పాక్‌-సౌతాఫ్రికాల మధ్య వన్డే, టీ20 వరల్డ్‌కప్‌ల మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఈ శతాబ్దంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. 2009 టీ20 వరల్డ్‌కప్‌లో మొదలైన పాక్‌ జైత్రయాత్ర 2022 టీ20 వరల్డ్‌కప్‌ వరకు కొనసాగింది. పాక్‌.. 2009, 2010, 2012, 2022 టీ20 వరల్డ్‌కప్‌ల్లో.. 2015, 2019 వన్డే వరల్డ్‌కప్‌ల్లో సౌతాఫ్రికాను మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లోనైనా సౌతాఫ్రికా.. పాక్‌ను ఓడిస్తుందో లేదో వేచి చూడాలి.    
 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)