Breaking News

టీమిండియాను ఓడించడం​ చాలా కష్టం: నెదర్లాండ్స్‌ కెప్టెన్‌

Published on Mon, 11/13/2023 - 08:18

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ అన్ని విభాగాల్లో రాణించి పసికూనపై పూర్తి స్థాయి ఆధిక్యత ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్‌ చేస్తూ కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో 410 పరుగుల భారీ స్కోర్‌ చేసిన భారత్‌.. బౌలింగ్‌లో టీమ్‌గా రాణించి ప్రత్యర్ధిని 250 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఈ గెలుపుతో భారత్‌ వరుసగా తొమ్మిదో విజయాన్ని నమోదు చేసి, లీగ్‌ దశలో అజేయ జట్టుగా నిలిచింది.

మ్యాచ్‌ అనంతరం నెదర్లాండ్స్‌ కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ మాట్లాడుతూ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్‌ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని కితాబునిచ్చాడు. ప్రస్తుత టోర్నీలో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అన్నాడు. భారత్‌ పటిష్టమైన జట్టు అనడానికి, వారు సాధిస్తున్న విజయాలే నిదర్శనమని తెలిపాడు. భారత బ్యాటింగ్‌ విభాగాన్ని ఆకాశానికెత్తాడు. సొగసైన బ్యాటింగ్‌ లైనప్‌ అని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో కొన్ని సందర్భాల్లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసినప్పటికీ, భారత బ్యాటర్లు ఎదురుదాడికి దిగి, మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేసారని అన్నాడు.

ఈ టోర్నీ చాలా కఠినంగా ఉండబోతుందని ముందే తెలుసు. శక్తివంచన లేకుండా ఆడాం. రెండు అద్భుత విజయాలు సాధించాం. పలు మ్యాచ్‌ల్లో గెలిచే అవకాశాలు కల్పించుకున్నాం. మరిన్ని విజయాలు సాధించాల్సి ఉండింది. ఓవరాల్‌గా మా ఆటతీరు సంతృప్తినిచ్చింది. ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే రాటుదేలుతున్నారు. ఈ టోర్నీ మాకు మంచి అనుభూతులను మిగిల్చింది. చాలా నేర్చుకున్నాము.  ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. జట్టుగా ఎదగడానికి ఈ టోర్నీ చాలా సాయపడింది. టీ20 వరల్డ్‌కప్‌ 2024లోపు మరింత మెరుగుపడాలని ఆశిస్తున్నామని అన్నాడు. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌.. పటిష్టమైన సౌతాఫ్రికాను, తమకంటే మెరుగైన బంగ్లాదేశ్‌కు ఊహించని షాకిచ్చిన విషయం తెలిసిందే. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)