Breaking News

ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ.. స్వదేశానికి పయనమైన స్టార్‌ ఓపెనర్‌

Published on Thu, 11/02/2023 - 10:35

ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌ రేసులో దూసుకుపోతున్న ఫైవ్‌ టైమ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌, ఓపెనింగ్‌ బ్యాటర్‌ మిచెల్‌ మార్ష్‌ వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి పయనమయ్యాడు. వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ తదుపరి ఆడబోయే  మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడని తెలుస్తుంది. ప్రపంచకప్‌ కోసం మార్ష్‌ తిరిగి భారత్‌కు రావడం అనుమానమేనని ఆసీస్‌ మీడియా వర్గాల సమాచారం.

ఊహించని ఈ పరిణామంతో ఆసీస్‌ క్రికెట్‌ వర్గాలు ఖంగుతిన్నాయి. అభిమానులు షాక్‌కు గురయ్యారు. వరల్డ్‌కప్‌ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ఆసీస్‌ ఇన్‌ ఫామ్‌ ప్లేయర్‌ సేవలు కోల్పోవడాన్ని జీర్జించుకోలేకపోతుంది.  మరోవైపు ఆసీస్‌ మరో స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సేవలను సైతం కోల్పోనుంది. తలకు తీవ్ర గాయం కావడం చేత మ్యాక్సీ నవంబర్‌ 4న ఇంగ్లండ్‌తో  జరిగే మ్యాచ్‌కు దూరంకానున్నాడు.  

గోల్ఫ్ కార్ట్ వాహనం నుండి పట్టు తప్పి కింద పడిపోవడంతో మ్యాక్సీ తలకు తీవ్ర గాయమైంది. రోజుల వ్యవధిలో ఆసీస్‌ ఇద్దరు స్టార్‌ ఆల్‌రౌండర్ల సేవలను కోల్పోవడంతో అభిమానులు దిగ్భ్రాంతి​కి గురవుతున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో మార్ష్‌, మ్యాక్సీ ఇద్దరు భీకర ఫామ్‌లో ఉన్నారు. ఈ ఇద్దరు చెరో మ్యాచ్‌లో సెంచరీ (మార్ష్‌ పాక్‌పై, మ్యాక్సీ నెదర్లాండ్స్‌పై) చేయడంతో పాటు వికెట్లు కూడా తీశారు. 

ఇదిలా ఉంటే, ‍ఆసీస్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించిన 0.970 రన్‌రేట్‌ కలిగి ఉంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయంతో సౌతాఫ్రికా టేబుల్‌ టాపర్‌ కాగా.. భారత్‌ రెండో స్థానంలో.. న్యూజిలాండ్‌ నాలుగో స్థానంలో ఉన్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)