Breaking News

రికార్డుల రారాజు కోహ్లి అరుదైన ఘనత.. ఇక మిగిలింది ఇద్దరే!

Published on Wed, 11/15/2023 - 16:28

టీమిండియా రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో మరో స్థానం మెరుగుపరచుకున్నాడు. తద్వారా ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌ పేరిట ఉన్న రికార్డు బ్రేక్‌ చేశాడు.

వన్డే వరల్డ్‌కప్‌-2023 తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈ ఫీట్‌ నమోదు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్‌ మూడో బంతికి గ్లెన్‌ ఫిలిప్స్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసిన కోహ్లి ఓవరాల్‌గా 13705 పరుగుల మార్కు అందుకున్నాడు. 

తద్వారా రిక్కీ పాంటింగ్‌ను వెనక్కినెట్టాడు. ఇక ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రచిన్‌ రవీంద్ర(26.6) బౌలింగ్‌లో సింగిల్‌ తీసిన కింగ్‌.. వన్డే వరల్డ్‌కప్‌ నాకౌట్‌ చరిత్రలో తన తొలి ఫిఫ్టీ నమోదు చేశాడు.

కాగా ఇప్పటి వరకు మూడు వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌లో ఆడిన కోహ్లి మొత్తం కలిపి కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2011 పాక్‌తో సెమీస్‌లో 9 పరుగులు... 2015 ఆస్ట్రేలియాతో సెమీస్‌లో 1 పరుగు... 2019 న్యూజిలాండ్‌తో సెమీస్‌లో 1 పరుగు మాత్రమే చేశాడు. తాజాగా ఈ చెత్త రికార్డు చెరిపేసి హాప్‌ సెంచరీతో మెరిశాడు.

అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన టాప్‌-5 బ్యాటర్లు
18426 - సచిన్ టెండూల్కర్
14234 - కుమార సంగక్కర
13705* - విరాట్ కోహ్లీ
13704 - రికీ పాంటింగ్
13430 - సనత్ జయసూర్య
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)