వరల్డ్‌కప్‌లో రోహిత్‌ శర్మ సరికొత్త చరిత్ర.. ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు

Published on Wed, 11/15/2023 - 14:49

CWC 2023- Ind vs NZ- Rohit Sharma Record: వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యధిక సిక్సర్ల వీరుడిగా వెస్టిండీస్ స్టార్‌ క్రిస్‌గేల్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌  రికార్డు బద్దలు కొట్టాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ముంబై వేదికగా టీమిండియా తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడుతోంది.

వాంఖడేలో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని.. కివీస్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి రోహిత్‌ శర్మ భారత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. ఈ క్రమంలో తొలి ఓవర్‌ నాలుగో బంతికి ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో తొలి బౌండరీ బాదిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. మూడో ఓవర్‌ మూడో బంతికి సిక్సర్ల ఖాతా తెరిచాడు.

ఆ తర్వాత మరో మూడు సిక్స్‌లు బాదాడు. దీంతో ప్రపంచకప్‌ తాజా ఎడిషన్‌లో రోహిత్‌ శర్మ సిక్సర్ల సంఖ్య 27కు చేరుకుంది. ఈ క్రమంలో వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా హిట్‌మ్యాన్‌ చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ను వెనక్కి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఇక న్యూజిలాండ్‌లో మ్యాచ్‌లో.. మొత్తంగా 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ శర్మ 47 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. పవర్‌ ప్లేలో దూకుడు ప్రదర్శించిన హిట్‌మ్యాన్‌ ఇన్నింగ్స్‌కు.. తొమ్మిదో ఓవర్‌ రెండో బంతి వద్ద తెరపడింది. కివీస్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ బౌలింగ్‌లో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ పెవిలియన్‌ చేరాడు.

వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లు
►27 - రోహిత్ శర్మ (2023)
►26 - క్రిస్ గేల్ (2015)
►22 - ఇయాన్ మోర్గాన్ (2019)
►22 - గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (2023)
►21 - ఏబి డివిలియర్స్ (2015)
►21 - క్వింటన్ డికాక్ (2023)

చదవండి: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా, గెలుపు మనదే?

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)