Breaking News

CWC 2023 IND VS NED: అజేయ భారత్‌.. అరుదైన ఘనత

Published on Mon, 11/13/2023 - 10:55

నెదర్లాండ్స్‌పై విక్టరీతో వన్డే వరల్డ్‌కప్‌ 2023లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన టీమిండియా ఓ అరుదైన ఘనత సాధించింది. వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది. 2003 ఎడిషన్‌లో సాధించిన 8 వరుస విజయాల రికార్డును భారత్‌ ప్రస్తుత ఎడిషన్‌లో అధిగమించింది.

ప్రపంచకప్ చరిత్రలో ఓ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక విజయాల రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన ఈ జట్టు 2003, 2007 ఎడిషన్లలో వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఈ జాబితాలో ఆసీస్‌, భారత్‌ల తర్వాత న్యూజిలాండ్‌ ఉంది. ఈ జట్టు 2015 వరల్డ్‌కప్‌లో భారత్‌ పూర్వపు రికార్డుతో సమానంగా వరుసగా 8 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. 

నెదర్లాండ్స్‌పై గెలుపుతో టీమిండియా తొమ్మిది వరుస విజయాల రికార్డుతో పాటు మరో ఘనత కూడా సాధించింది. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో తమ అత్యుత్తమ విజయాల రికార్డును ఈ గెలుపుతో సమం చేసింది. 1998లో 24 వన్డేల్లో విజయాలు సాధించిన భారత్‌.. ప్రస్తుత ఏడాది ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ఆ మార్కును అందుకుంది. 

కాగా, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (61), శుభ్‌మన్‌ గిల్‌ (51), విరాట్‌ కోహ్లి (51) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.

అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ భారత బౌలర్లు తలో చేయి వేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్‌, రోహిత్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)