Breaking News

IND VS NED: విరాట్‌ కంటే ఎక్కువగా బాధపడిపోయిన అనుష్క

Published on Sun, 11/12/2023 - 21:09

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌  చేసిన టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్‌ శర్మ (61), శుభ్‌మన్‌ గిల్‌ (51), విరాట్‌ కోహ్లి (51) హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేస్తుండటంతో ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు స్కోర్‌ 38 ఓవర్లు ముగిసిన అనంతరం 173/6గా ఉంది. ఎలా చూసినా ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ గెలిచే అవకాశాలు లేవు.

కాగా, ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌ సమయంలో టీవీల్లో తారసపడిన పలు ఆసక్తికర సన్నివేశాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. సూపర్‌ టచ్‌లో కనిపించిన విరాట్‌ కోహ్లి 51 పరుగుల వద్ద వాన్‌ డర్‌ మెర్వ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ కావడంతో అతని భార్య అనుష్క శర్మ ముఖంలో కనిపించిన హావభావాలు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. కోహ్లి 50వ వన్డే సెంచరీ కోసం అతని కంటే అతని భార్య ఎక్కువగా పరితపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఇదే మ్యాచ్‌లో తారసపడిన మరో సన్నివేశం సైతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. విరాట్‌ నెదర్లాండ్స్‌ కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ వికెట్‌ తీసిన అనంతరం అతనికంటే అతని భార్య అనుష్క శర్మనే ఎక్కువగా సంబురాలు చేసుకుంది. ఈ వీడియో కూడా నెట్టింట సందడి చేస్తుంది. మొత్తంగా నిన్నటి నుంచి విరాట్‌-అనుష్క వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

టీమిండియా దీపావళి సంబురాలకు సంబంధించిన వీడియోలో సైతం వీరిద్దరే సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇదిలా ఉంటే, విరాట్‌ వన్డేల్లో సచిన్‌ పేరిట ఉన్న అత్యధిక​ సెంచరీల రికార్డును (49) బద్దలు కొట్టేందుకు కేవలం సెంచరీ దూరంలో ఉన్న విషయం తెలిసిందే.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)