Breaking News

ప్రపంచకప్‌ చరిత్రలో ఎవరి వల్ల కాలేదు.. ఇంగ్లండ్‌కు మాత్రమే సాధ్యమైంది

Published on Mon, 10/16/2023 - 08:10

ప్రపంచకప్‌-2023లో పసికూన ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో ఓటమి అనంతరం జగజ్జేత ఇంగ్లండ్‌ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ప్రపంచకప్‌ చరిత్రలో అన్ని టెస్ట్‌ ప్లేయింగ్‌ జట్ల (11) చేతుల్లో ఓడిన తొలి జట్టుగా రికార్డుల్లోకెక్కింది. 

1975 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన ఇంగ్లండ్‌.. ఆతర్వాత 1979 వరల్డ్‌కప్‌ ఫైనల్లో వెస్టిండీస్‌ చేతిలో పరాజయాన్ని మూటగట్టుకుంది. అనంతరం 1983, 1987 ప్రపంచకప్‌ల్లో భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ చేతుల్లో ఓడిన ఇంగ్లండ్‌.. 1992 వరల్డ్‌కప్‌లో పసికూన జింబాబ్వే చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 

1996 ప్రపంచకప్‌లో శ్రీలంక, సౌతాఫ్రికా చేతుల్లో పరాజయాలు ఎదుర్కొన్న ఇంగ్లీష్‌ టీమ్‌కు 2011 ప్రపంచకప్‌లో ఊహించని పరాభవం ఎదురైంది. ఈ ఎడిషన్‌లో ఆ జట్టు ఐర్లాండ్‌ చేతిలో ఓటమిపాలైంది. 2015లో ఇంగ్లండ్‌కు మరో షాక్‌ తగిలింది. ఆ ఎడిషన్‌లో ఇంగ్లీష్‌ టీమ్‌.. బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమిపాలైంది. తాజా వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో ఓటమితో, అన్ని టెస్ట్‌ ప్లేయింగ్‌ దేశాల చేతుల్లో ఓటములు ఎదుర్కొన్న తొలి జట్టుగా ఎవరికీ సాధ్యంకాని చెత్త రికార్డును ఇంగ్లండ్‌ మూటగట్టుకుంది.

కాగా, న్యూఢిల్లీ వేదికగా నిన్న (అక్టోబర్‌ 15) జరిగిన మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్‌.. జగజ్జేత ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్‌ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)