Breaking News

WC 2023: వరల్డ్‌కప్‌లో స్టోక్స్‌ తొలి సెంచరీ.. ఇంగ్లండ్‌ భారీ స్కోరు

Published on Wed, 11/08/2023 - 17:51

ICC WC 2023- Eng Vs Ned: వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా వరల్డ్‌కప్‌ టోర్నీలో తన తొలి శతకం నమోదు చేశాడు.

పుణె వేదికగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో(15) విఫలం కాగా.. మరో ఓపెనర్‌ డేవిడ్‌ మలన్‌ 87 పరుగులతో రాణించాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జో రూట్‌ చెత్త షాట్‌ సెలక్షన్‌తో 28 పరుగులకే వెనుదిరగగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టోక్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

మొత్తంగా 84 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో వరల్డ్‌కప్‌లో తన పేరిటా ఓ సెంచరీని లిఖించుకున్నాడు.


మిగతా వాళ్లలో క్రిస్‌ వోక్స్‌ అర్ద శతకం(51) బాదాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు సాధించింది. డచ్‌ బౌలర్లలో బాస్‌ డి లిడే మూడు, ఆర్యన్‌ దత్‌, లోగన్‌ వాన్‌ బీక్‌ చెరో రెండు, పాల్‌ వాన్‌ మెకెరన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

కాగా డిఫెండింగ్‌ చాంపియన్‌గా భారత్‌ వేదికగా ప్రపంచకప్‌ బరిలో దిగిన ఇంగ్లండ్‌ ఇప్పటికే సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నెదర్లాండ్స్‌కు కూడా సెమీ ఫైనల్‌ అవకాశాలు లేవు. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో 9, 10 స్థానాల కోసం అన్నట్లుగా ఈ నామమాత్రపు మ్యాచ్‌ జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. గాయం కారణంగా ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన స్టోక్స్‌ పునరాగమనంలోనూ  పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే, ఈ నామమాత్రపు మ్యాచ్‌లో మాత్రం సెంచరీ చేయడం విశేసం. కాగా 2019లో ఇంగ్లండ్‌ ట్రోఫీ గెలవడంలో స్టోక్స్‌దే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)