CWC 2023: విరాట్‌ కోహ్లికి మూడు, షమీకి రెండు.. అవార్డుల జాబితా

Published on Mon, 11/20/2023 - 11:25

CWC 2023 Winner Australia: క్రికెట్‌ మెగా సమరానికి తెరపడింది. భారత్‌ వేదికగా అక్టోబరు 5న మొదలైన వన్డే వరల్డ్‌కప్‌ పండుగ ఆదివారంతో ముగిసిపోయింది. అజేయ రికార్డుతో ఫైనల్‌ చేరిన టీమిండియా ట్రోఫీ గెలుస్తుందని కోటి ఆశలతో ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది.

అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో రోహిత్‌ సేనను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. అనూహ్య విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించిన ప్యాట్‌ కమిన్స్‌ బృందం విజయంతో ఈ ఐసీసీ టోర్నీని ముగించి సగర్వంగా స్వదేశానికి వెళ్లనుంది.

ఇదిలా ఉంటే.. అసలు మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ వంటి అవార్డులు గెలుచుకుంది.

ప్రపంచకప్‌-2023 టోర్నమెంట్లో వివిధ అవార్డులు అందుకున్న ప్లేయర్ల లిస్టు
1.ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ - విరాట్ కోహ్లీ- ఇండియా (765 పరుగులు, 1 వికెట్, 5 క్యాచ్‌లు)
2. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఫైనల్‌- ట్రవిస్‌ హెడ్‌- ఆస్ట్రేలియా(137 పరుగులు, 1 క్యాచ్‌)
3.అత్యధిక పరుగులు- విరాట్‌ కోహ్లి(11 ఇన్నింగ్స్‌లో 765 పరుగులు)
4.అత్యధిక స్కోరు- గ్లెన్‌ మాక్స్‌వెల్‌(ముంబైలో అఫ్గనిస్తాన్‌ మీద 201 పరుగులు- నాటౌట్‌)
5. అత్యధిక సెంచరీలు- క్వింటన్‌ డికాక్‌- సౌతాఫ్రికా(4 శతకాలు)

6. అత్యధిక అర్ధ శతకాలు- విరాట్‌ కోహ్లి(6 ఫిఫ్టీలు)
7. అత్యధిక వికెట్లు- మహ్మద్‌ షమీ- ఇండియా(7 ఇన్నింగ్స్‌లో 24 వికెట్లు)
8. అత్యుత్తమ గణాంకాలు- మహ్మద్‌ షమీ(ముంబైలో న్యూజిలాండ్‌ మీద 7/57)
9. అత్యధిక సిక్సర్లు- రోహిత్‌ శర్మ- ఇండియా(31 సిక్స్‌లు)

10. అత్యధిక క్యాచ్‌లు- డారిల్‌ మిచెల్‌- న్యూజిలాండ్‌(11 క్యాచ్‌లు)
11. అత్యధిక అవుట్లు చేసిన వికెట్‌ కీపర్‌- క్వింటన్‌ డికాక్‌(20)
13. అత్యధిక స్ట్రైక్‌రేటు- గ్లెన్‌ మాక్స్‌వెల్‌(150.37)

పూర్తి వివరాలు- ఇతర విశేషాలు
►ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా భారత స్టార్‌ విరాట్‌ కోహ్లి నిలిచాడు. కోహ్లి 11 మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు,  6 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 765 పరుగులు సాధించాడు. 
 
►ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భారత పేసర్‌ మొహమ్మద్‌ షమీ నిలిచాడు.  షమీ 7 మ్యాచ్‌లు ఆడి మొత్తం  24 వికెట్లు పడగొట్టాడు. షమీ మొత్తం 48.5 ఓవర్లు వేసి 257 పరుగులు ఇచ్చాడు. 
 
►మొత్తం ప్రపంచకప్‌ టోర్నీలలో అత్యధిక టీమ్‌ స్కోరు ఈ ప్రపంచకప్‌లోనే నమోదైంది. శ్రీలంకతో న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్లకు  428 పరుగులు సాధించింది.  

►ధర్మశాలలో ఆ్రస్టేలియా (388 ఆలౌట్‌; 49.2 ఓవర్లలో), న్యూజిలాండ్‌ (50 ఓవర్లలో 383/9) జట్ల మధ్య  జరిగిన మ్యాచ్‌లో మొత్తం 771 పరుగులు వచ్చాయి. ప్రపంచకప్‌ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధికం.  
 
►ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత నమోదు చేసిన బ్యాటర్‌గా ఆస్ట్రేలియా క్రికెటర్‌ మ్యాక్స్‌వెల్‌ నిలిచాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ (128 బంతుల్లో 201 నాటౌట్‌; 21 ఫోర్లు, 10 సిక్స్‌లు) అజేయ డబుల్‌ సెంచరీ సాధించాడు.  
 
►ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా భారత పేసర్‌ మొహమ్మద్‌ షమీ నిలిచాడు. న్యూజిలాండ్‌తో ముంబైలో జరిగిన సెమీఫైనల్లో షమీ 57 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు.  
 
►ఈ ప్రపంచకప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 400 అంతకంటే ఎక్కువ స్కోర్లు మూడుసార్లు నమోదయ్యాయి. శ్రీలంకపై దక్షిణాఫ్రికా (428/5), నెదర్లాండ్స్‌పై భారత్‌ (410/4), పాకిస్తాన్‌పై న్యూజిలాండ్‌ (401/6) సాధించాయి. 

►వన్డే వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద  టోర్నమెంట్‌’ అవార్డు గెల్చుకున్న మూడో భారతీయ క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లి గుర్తింపు పొందాడు. గతంలో సచిన్‌ టెండూల్కర్‌ (2003లో), యువరాజ్‌ సింగ్‌ (2011లో) ఈ ఘనత సాధించారు.

చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది! వారిద్దరికి క్రెడిట్‌: రోహిత్‌ శర్మ 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)