Breaking News

AUS VS AFG: మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం.. కమిన్స్‌ ఖాతాలో చెత్త రికార్డు

Published on Wed, 11/08/2023 - 11:33

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర డబుల్‌ సెంచరీతో (128 బంతుల్లో 201 నాటౌట్‌; 21 ఫోర్లు, 10 సిక్సర్లు)  విరుచుకుపడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. 292 పరుగుల లక్ష్య ఛేదనలో ఓటమి కొరల్లో (91/7) చిక్కుకున్న ఆసీస్‌ను మ్యాక్సీ వీరోచితంగా పోరాడి ఒంటిచేత్తో గెలిపించాడు. కదలలేని స్థితిలో సైతం మ్యాక్స్‌వెల్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి ప్రతి క్రికెట్‌ అభిమాని మనసు దోచుకున్నాడు. మ్యాక్సీ బ్యాట్‌ నుంచి జాలువారిన ఈ ఇన్నింగ్స్‌ వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమమైనదిగా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. 

ఆఫ్ఘన్‌పై గెలుపులో మ్యాక్సీ అన్నీ తానై వ్యవహరించగా, కెప్టెన్‌ కమిన్స్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ (68 బంతుల్లో 12 నాటౌట్‌; ఫోర్‌) ఆడి తనవంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్‌ పలు అదిరిపోయే రికార్డులను తన ఖాతాలో వేసుకోగా.. కమిన్స్‌ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ రికార్డు వ్యక్తిగతంగా కమిన్స్‌కు చెత్త రికార్డే అయినప్పటికీ.. ఆసీస్‌ గెలుపులో ప్రధానపాత్ర పోషించింది. ఓ పక్క మ్యాక్సీ చెలరేగుతుంటే, మరో ఎండ్‌లో కమిన్స్‌ వికెట్‌ కాపాడుకుంటూ జాగ్రత్తగా స్ట్రయిక్‌ రొటేట్‌ చేశాడు. ఆఫ్ఘన్‌పై గెలుపులో మ్యాక్సీలా కమిన్స్‌ పాత్ర కూడా వెలకట్టలేనిది. ఒకవేళ కమిన్స్‌ మ్యాక్స్‌వెల్‌కు సహకరించకపోయి ఉంటే ఆసీస్‌ ఘోర పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. 

ఇంతకీ కమిన్స్‌ పేరిట నమోదైన ఆ చెత్త రికార్డు ఏంటంటే.. వరల్డ్‌కప్‌లో కనీసం​ 10 పరుగులు చేసి రెండో అత్యల్ప స్ట్రయిక్‌రేట్‌ నమోదు చేసిన ఆటగాడిగా కమిన్స్‌ రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 68 బంతులు ఎదుర్కొన్న కమిన్స్‌ కేవలం 17.64 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. వరల్డ్‌కప్‌లో కనీసం 10 పరుగులు చేసి ఇంతకంటే తక్కువ స్ట్రయిక్‌రేట్‌ నమోదు చేసిన రికార్డు జింబాబ్వే ఆటగాడు జాక్‌ హెరన్‌ పేరిట ఉంది. 1983 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హెరన్‌ అత్యల్పంగా 16.43 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. రికార్డు విషయం అటుంచితే, కమిన్స్‌ మ్యాక్సీతో పాటు మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడి తన జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. కాగా, ఆఫ్ఘన్‌పై గెలుపుతో ఆస్ట్రేలియా సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. సెమీస్‌లో ఆసీస్‌ సౌతాఫ్రికాతో తలపడనుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)