సామ్‌ కర్రన్‌ అద్భుత ప్రదర్శన.. డెజర్ట్ వైపర్స్‌కు తొలి ILT20 టైటిల్

Published on Mon, 01/05/2026 - 11:17

ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 2025-26 ఎడిషన్‌ టైటిల్‌ను డెజర్ట్ వైపర్స్‌ కైవసం​ చేసుకుంది. దుబాయ్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో MI ఎమిరేట్స్‌ను 46 పరుగుల తేడాతో చిత్తు చేసి తమ తొలి DP వరల్డ్ ILT20 టైటిల్‌ను సొంతం చేసుకుంది. 

ఈ గెలుపుతో వైపర్స్‌ 7 లక్షల యూఎస్‌ డాలర్ల నగదు బహుమతి సహా బ్లాక్ బెల్ట్‌ను అందుకుంది. రన్నరప్‌ MI ఎమిరేట్స్‌కు 3 లక్షల యూఎస్‌ డాలర్ల నగదు బహుమతి లభించింది. 

కర్రన్‌ వన్‌ మ్యాన్‌ షో
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వైపర్స్‌.. కెప్టెన్‌ సామ్‌ కర్రన్‌ (51 బంతుల్లో 74 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ద సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. మ్యాక్స్‌ హోల్డన్‌ (41) ఓ మోస్తరు స్కోర్‌తో రాణించగా.. డాన్‌ లారెన్స్‌ 23, ఫకర్‌ జమాన్‌ 20, జేసన్‌ రాయ్‌ 11 పరుగులు చేశారు. ఎంఐ బౌలర్లలో ఫజల్‌ హక్‌ ఫారూకీ 2, అరబ్‌ గుల్‌ ఓ వికెట్‌ తీశారు.

అనంతరం 183 పరుగుల లక్ష్య ఛేదనలో ఎం జట్టు ఆదిలోనే చేతులెత్తేసింది. నసీం​ షా (4-0-18-3), డేవిడ్‌ పేన్‌ (4-0-42-3), ఖుజామియా తన్వీర్‌ (3.3-0-22-2), ఉస్మాన్‌ తారిక్‌ (4-0-20-2) ధాటికి 18.3 ఓవర్లలో 136 పరుగులకే చాపచుట్టేసింది. 

ఎంఐ ఇన్నింగ్స్‌లో షకీబ్‌ అల్‌ హసన్‌ (36) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. కెప్టెన్‌ కీరన్‌ పోలార్డ్‌ (28), ముహమ్మద్‌ వసీం (26), తేజిందర్‌ డిల్లాన్‌ (12), ఆండ్రీ ఫ్లెచర్‌ (10) రెండంకెల స్కోర్లు చేశారు.

టోర్నీ ఆధ్యాంతం ఆల్‌రౌండర్‌ షోతో అదరగొట్టిన సామ్‌ కర్రన్‌ (97 పరుగులు, 7 వికెట్లు, 10 క్యాచ్‌లు) రెడ్ బెల్ట్ (MVP), గ్రీన్ బెల్ట్ (Best Batter) గెలుచుకున్నాడు. వకార్‌ సలాంఖిల్‌ (Dubai Capitals)– వైట్ బెల్ట్ (Best Bowler, 18 వికెట్లు),  ముహమ్మద్ వసీమ్ (MI Emirates– బ్లూ బెల్ట్ (Best UAE Player, 370 పరుగులు) గెలుచుకున్నారు. 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)