Breaking News

CSK VS SRH: మార్కండే సూపర్‌ డెలివరీ..అయ్యో ఎంత పని జరిగిపోయింది!

Published on Sat, 04/22/2023 - 13:24

ఐపీఎల్‌ 2023లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్‌ 21) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోని దళం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి, సూపర్‌ విక్టరీ సాధించింది. జడేజా అదిరిపోయే బౌలింగ్‌ పెర్ఫార్మెన్స్‌ (4-0-22-3), డెవాన్‌ కాన్వే (77 నాటౌట్‌) బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో సీఎస్‌కేకు సునాయాస విజయాన్ని అందించారు.

వీరితో పాటు జట్టులోని అందరూ తలో చేయి వేయడంతో సీఎస్‌కే కంఫర్టబుల్‌ విక్టరీ సాధించింది. తద్వారా 8 పాయింట్లు (0.355) ఖాతాలో వేసుకుని, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్‌ రాయల్స్‌ (1.043), లక్నో సూపర్‌ జెయింట్స్‌ (0.709) సైతం ఎనిమిదే పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

ఇన్ని సానుకూల అంశాల నడుమ సీఎస్‌కేను ఒక్క విషయం మాత్రం తీవ్రంగా బాధిస్తుంది. అదే, ఆ జట్టు మిడిలార్డర్‌ బ్యాటర్‌ అంబటి రాయుడు ఫామ్‌ లేమి. ప్రస్తుత సీజన్‌లో రాయుడు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒక్క భారీ ఇన్నింగ్స్‌ కూడా ఆడలేదు. లక్నో (27 నాటౌట్‌), ముంబై (20 నాటౌట్‌)లపై ఓ మోస్తరు ప్రదర్శనలు మినహాయించి, మిగతా 4 మ్యాచ్‌ల్లో అతను దారుణంగా విఫలమయ్యాడు.

ఈసారి ఎలాగైనా టైటిల్‌ నెగ్గి కెరీర్‌ను ఘనంగా ముగించాలనుకుంటున్న అతనికి, అతని కెప్టెన్‌ ధోనికి ఈ విషయం అస్సలు సహించడం లేదని సమాచారం. మరి ముఖ్యంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రాయుడు ఔటైన విధానం, కెప్టెన్‌తో పాటు ఫ్యాన్స్‌కు సైతం విస్మయాన్ని కలిగించింది. మయాంక్‌ మార్కండే బౌలింగ్‌లో బంతిని జడ్జ్‌ చేయడంలో విఫలమైన రాయుడు (9).. చాలా చీప్‌గా క్లీన్‌ బౌల్డయ్యాడు.  రాయుడు చీప్‌ డిస్మిసల్‌పై సీఎస్‌కే ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్యాగ్‌ చేస్తూ.. రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏమయ్యా రాయుడు.. మరీ ఇంత చీప్‌గా బౌల్డ్‌ అయిపోతివి అంటూ కామెంట్లు చేస్తున్నారు.  
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?