Breaking News

CSK VS MI: లేటు వయసులోనూ ఇరగదీస్తున్న పియూష్‌ చావ్లా.. మూడో స్థానానికి..!

Published on Sat, 05/06/2023 - 18:55

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ పియూష్‌ చావ్లా మూడో స్థానానికి ఎగబాకాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఇవాళ (మే 6, మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన చావ్లా.. సహచర వెటరన్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రాను వెనక్కు నెట్టి టాప్‌-3లోకి చేరాడు. ప్రస్తుతం పియూష్‌ ఖాతాలో 173 వికెట్లు ఉన్నాయి. ఈ జాబితాలో డ్వేన్‌ బ్రావో (183) టాప్‌లో ఉండగా.. రాజస్థాన్‌ స్పిన్నర్‌ చహల్‌ రెండులో.. పియూష్‌, అమిత్‌ మిశ్రా (172), మలింగ (170), అశ్విన్‌ (170) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నారు. 

కాగా, ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిధ్య సీఎస్‌కే గెలుపు దిశగా సాగుతోంది. ఆ జట్టు మరో 17 పరుగులు చేస్తే (15 ఓవర్లలో 123/3) సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేస్తుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. సీఎస్‌కే బౌలర్లు పతిరణ (4-0-15-3), దీపక్‌ చాహర్‌ (3-0-18-2), తుషార్‌ దేశ్‌పాండే (4-0-26-2) విజృంభించడంతో 139 పరుగులకే పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో నేహల్‌ వధేరా (64) ఒక్కడే రాణించాడు. 

అనంతరం 140 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్‌కేకు ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (41నాటౌట్‌), శివమ్‌ దూబే (16 నాటౌట్‌) విజయం దిశగా నడిపిస్తున్నారు. రుతురాజ్‌ (30), రహానే (21), రాయుడు (12) ఔటయ్యారు. ముంబై బౌలర్లలో పియూష్‌ చావ్లా 2, ట్రిస్టన్‌ స్టబ్స్‌కు ఓ వికెట్‌ దక్కింది. 

చదవండి: రోహిత్‌ డకౌట్‌ వెనుక ధోని మాస్టర్‌మైండ్‌!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)