Breaking News

IPL 2023: చరిత్ర సృష్టించనున్న ఎంఎస్‌ ధోని

Published on Sun, 05/28/2023 - 11:00

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని చరిత్ర సృష్టించనున్నాడు. గుజరాత్‌తో నేడు (మే 28) జరుగబోయే ఫైనల్‌ మ్యాచ్‌ ఆడటం ద్వారా ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోనున్నాడు. ఐపీఎల్‌ హిస్టరీ ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా 250 మ్యాచ్‌లు ఆడలేదు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ధోని రికార్డుల్లోకెక్కనున్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోని తర్వాత ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (243), ఆర్సీబీ వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ (242), ఆర్సీబీ విరాట్‌ కోహ్లి (237), సీఎస్‌కే రవీంద్ర జడేజా (225), పంజాబ్‌ సారధి శిఖర్‌ ధవన్‌ (217), సీఎస్‌కే మాజీ ప్లేయర్లు సురేశ్‌ రైనా (205), రాబిన్‌ ఉతప్ప (205), అంబటి రాయుడు (203), రాజస్థాన్ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (197) వరుసగా 2 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు.

అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్‌-10 ప్లేయర్స్‌ జాబితాలో ఏకంగా ఐదుగురు సీఎస్‌కేకు చెందిన వారే ఉండటం విశేషం. కాగా, ఇవాల్టి మ్యాచ్‌తో ఐపీఎల్‌ కెరీర్‌లో 250 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోనున్న ధోని.. ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి టైటిల్‌ సాధిస్తే మరో రెండు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఇందులో మొదటిది.. రోహిత్‌ శర్మతో సమానంగా ఐదు ఐపీఎల్‌ టైటిళ్లు సాధించడం.

రోహిత్‌ సారధ్యంలో ముంబై  2013, 2015, 2017, 2019, 2020 సీజన్ల టైటిళ్లు సాధించగా.. ధోని నేతృత్వంలో చెన్నై 2010, 2011, 2018, 2021 సీజన్ల టైటిళ్లు గెలుపొందింది. ధోని.. ఐపీఎల్‌ 2023 టైటిల్‌ గెలిస్తే రోహిత్‌తో సమానంగా నిలుస్తాడు. మరో రికార్డు ఏంటంటే.. నేటి ఫైనల్లో సీఎస్‌కే.. గుజరాత్‌ను ఓడించి టైటిల్‌ సాధిస్తే, అతి పెద్ద వయసులో (41) ఐపీఎల్‌ టైటిల్‌ సాధించిన కెప్టెన్‌గా ధోని రికార్డుల్లోకెక్కనున్నాడు.

చదవండి: ‘ఫైనల్‌’ ధమాకా.. సీఎస్‌కే వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌
 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)