Breaking News

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన క్రిస్టియానో ​​రొనాల్డో

Published on Thu, 11/05/2026 - 16:30

ఫుట్‌బాల్ ప్రపంచంలో మరొక అద్భుతమైన శకం ముగిసింది. పోర్చుగల్ ఫుట్‌బాల్‌ లెజెండ్ క్రిస్టియానో ​​రొనాల్డో తన 23 ఏళ్ల అంత‌ర్జాతీయ కెరీర్‌కు రొనాల్డో వీడ్కోలు ప‌లికాడు.  41 ఏళ్ల రొనాల్డో గురువారం సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాడు. 

"జాతీయ జట్టు తరఫున మైదానంలో ఈరోజుతో నా ప్రయాణం ముగిసింది. సగర్వంగా తలెత్తుకుని.. గర్వంతో జట్టును వీడుతున్నా. పోర్చుగల్‌ కోసం నా సర్వస్వం అర్పించాను. నా ప్రయాణం పట్ల గర్వంగా ఉంది. ఏడో నంబర్‌ జెర్సీ నాకు గర్వకారణం. ఎల్లప్పుడూ అది నాకే చెందుతుంది. నాలో పోర్చుగల్‌ ఎల్లప్పుడూ భాగమే. మీ క్రిస్టియానో రొనాల్డో" అంటూ రొనాల్డో భావోద్వేగ సందేశం పంచుకున్నాడు.

రికార్డులు, ట్రోఫీలు, మర్చిపోలేని విజయాలతో సుదీర్ఘ కాలం పాటు ఫుట్‌బాల్ ప్రపంచాన్ని శాసించిన రొనాల్డో.. జట్టు హెడ్ కోచ్ జార్జ్ జెసస్‌తో ఏర్పడిన వివాదం అనంతరం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది.

రొనాల్డో ఆల్‌టైమ్ రికార్డులు
2003లో పోర్చుగల్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రొనాల్డో.. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో చారిత్రత్మక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా రొనాల్డో(234)నే కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడు కూడా రొనాల్డోనే కావడం విశేషం. 234 మ్యాచ్‌ల్లో అతడు 146 గోల్స్ సాధించాడు.

పోర్చుగల్‌కు తొలి యూరో టైటిల్‌

పోర్చుగల్‌కు మొట్టమొదటి యూరోపియన్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను అందించిన ఘనత కూడా రొనాల్డోదే. 2016 యూరో కప్‌ను అతడి సారథ్యంలో పోర్చుగల్ సొంతం చేసుకుంది. ఆ టోర్నీలో కెప్టెన్‌గా జట్టును నడిపించడమే కాకుండా ఫైనల్లో 3 కీలక గోల్స్ కూడా చేశాడు. ఆ తర్వాత 2019లో స్విట్జర్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ సాధించి.. తొలి ఎడిషన్ నేషన్స్ లీగ్ కప్‌ను పోర్చుగల్ గెలవడంలో రొనాల్డో కీలక పాత్ర పోషించాడు. 2025లో స్పెయిన్‌తో జరిగిన ఫైనల్లో గోల్ కొట్టి, పోర్చుగల్‌కు రెండోసారి నేషన్స్ లీగ్ టైటిల్‌ను అందించాడు.

నెరవేరని కల
క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్‌లో ఎన్నో అద్భుత విజయాలు సాధించినప్పటికి.. ఫిఫా ప్రపంచకప్ టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. రొనాల్డో తన కెరీర్‌లో ఇప్పటివరకు ఫిఫా ప్రపంచకప్‌ను గెలవలేదు. పోర్చుగల్ తరఫున 6 ప్రపంచకప్‌లు ఆడిన రొనాల్డో.. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయాడు. ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో పోర్చుగల్ ఓడిపోవడంతో రొనాల్డో ఆఖరి వరల్డ్ కప్ ప్రయాణం ముగిసింది.


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)