Breaking News

కొంప‌ముంచిన హెడ్‌.. క్రికెట్ ఆస్ట్రేలియాకు రూ.17 కోట్లు నష్టం!

Published on Sun, 11/23/2025 - 17:00

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టెస్టు కేవలం రెండు రోజుల్లో ముగిసిన సంగతి తెలిసిందే. ట్రావిస్ హెడ్‌ విధ్వంసకర సెంచరీ ఫలితంగా ఇంగ్లండ్‌ను 8 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. 205 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 28.2 ఓవర్లలో ఊదిపడేసింది.

అయితే పెర్త్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (CA) భారీ నష్టం చవిచూసినట్లు తెలుస్తోంది. మూడు, నాలుగు రోజుల ఆటకు సంబంధించిన టిక్కెట్లు దాదాపుగా అమ్ముడైపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియాకు రూ. 17 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. టిక్కెట్లు బుక్ చేసుకున్న వారిందరికి రిఫండ్ చేయనున్నారు. 

ఈ యాషెస్ ఓపెనింగ్ టెస్టును వీక్షించేందుకు తొలి రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో 1,01,514 మంది ప్రేక్షకులు  హాజరయ్యారు. గ‌తేడాది ఆఖ‌రిలో ఇదే వేదికలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు మ్యాచ్‌కు కూడా ఇంత భారీ సంఖ్యలో ప్రేక్షకులు  హాజరు కాలేదు. మొద‌టి నాలుగు రోజుల్లో మొత్తంగా 96,463 మంది స్టేడియంకు వ‌చ్చారు. 

పెర్త్‌లో జ‌రిగిన యాషెస్‌ తొలి టెస్టును టీవీల్లో కూడా 245,000 మంది వీక్షించిన‌ట్లు ఛాన‌ల్ 7 ప్ల‌స్ వెల్ల‌డించింది.  ఇక ఆదివారం కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు హెడ్ క్షమాపణలు చెప్పాడు. "మూడో రోజు కూడా స్టేడియం నిండిపోతుందని అనుకున్నాను. కానీ రెండో రోజుల్లోనే ఆట ముగిసిపోయింది. టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారిందరికి సారీ" ఓ ప్రకటనలో హెడ్‌ పేర్కొన్నాడు.

కాగా క్రికెట్ ఆస్ట్రేలియా రిఫండ్ పాలసీ ప్రకారం.. రద్దు చేయబడిన రోజులకు సింగిల్-డే టిక్కెట్లు ఉన్న అభిమానులు
పూర్తి రిఫండ్‌కు అర్హులు. కాబట్టి, డే 3, డే 4, డే 5 టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి బోర్డు తప్పనిసరిగా డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
 

Videos

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు