రోహిత్‌, కోహ్లి ఫేర్‌వెల్‌కు ప్లాన్‌ చేస్తున్న క్రికెట్‌ ఆస్ట్రేలియా

Published on Sun, 06/08/2025 - 16:00

భారత క్రికెట్‌ దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి టీ20, టెస్ట్‌ ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇరువురు వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉన్నారు. రోకో (రోహిత్‌, కోహ్లి) 2027 వన్డే వరల్డ్‌కప్‌ వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతామని సూచనప్రాయంగా తెలిపినట్లు సమాచారం.

రోకో ఈ ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా తరఫున బరిలోకి దిగవచ్చు. అనంతరం అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ పాల్గొనవచ్చు. ఒకవేళ ఈ సిరీస్‌లో రోకోకు పాల్గొంటే కెరీర్‌లో వారికి అదే చివరి ఆస్ట్రేలియా పర్యటన అవుతుంది.

ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా రోహిత్‌, కోహ్లి ఫేర్‌వెల్‌కు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. హిందుస్తాన్‌ టైమ్స్‌ కథనం ప్రకారం.. క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈవో టాడ్‌ గ్రీన్‌బర్గ్‌ అక్టోబర్‌లో జరిగే భారత్‌, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ సందర్భంగా రోహిత్‌, కోహ్లిలకు ఘనంగా వీడ్కోలు పలకాలని ‍ప్లాన్‌ చేస్తున్నారు.

ఓ సందర్భంగా టాడ్‌ ఇలా అన్నారు. మా దేశంలో (ఆస్ట్రేలియా) విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడటం అదే చివరిసారి కావచ్చు. ఒకవేళ అలా అయితే వారికి గొప్పగా వీడ్కోలు పలకాల్సిన ధర్మం మాకుంది. వారిరువురు భారత క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంతో చేశారు. అలాంటి వారికి గౌరవించుకోవాల్సిన అవసరం​ ఎంతైనా ఉంది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన చేస్తాము.

ఇదిలా ఉంటే, రోహిత్‌, కోహ్లి తాజాగా ముగిసిన బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌ తర్వాత టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. వారిద్దరి కెరీర్‌లో చివరి టెస్ట్‌లు ఆస్ట్రేలియా గడ్డపైనే ఆడారు. అయితే ఆ సిరీస్‌ జరిగే నాటికి రోహిత్‌, కోహ్లి రిటైర్మెంట్‌ గురించి ఆలోచించకపోయి ఉండవచ్చు. ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు చోటు చేసుకున్న పరిణామాల అనంతరం వారిద్దరు రోజుల వ్యవధిలో టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పారు.

బీసీసీఐ సైతం రోహిత్‌, కోహ్లిలకు ఫేర్‌వెల్‌ పలకలేకపోయింది. ఈ జోడీ టెస్ట్‌ల్లో ఇంకొంతకాలం కొనసాగుతారని అంతా అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ, వారిద్దరు టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పి భారత క్రికెట్‌ అభిమానులను షాక్‌కు గురి చేశారు. రోకో 2027 వరల్డ్‌కప్‌ వరకు వన్డేల్లో కొనసాగుతామని చెప్పినప్పటికీ.. ఈ విషయంపై కూడా అంత గ్యారెంటీ లేదు.

ఎందుకంటే, ఆ సమయానికి రోహిత్‌ వయసు 40, కోహ్లి వయసు 38గా ఉంటుంది. ఆ టైమ్‌ వరకు ఇరువురు ఫిట్‌గా ఉంటారో లేదో. ఈ విషయంలో కోహ్లి గురించి ఆలోచన లేనప్పటికీ, రోహిత్‌పైనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే రోహిత్‌ ఫిట్‌నెస్‌కు సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. మరో రెండేళ్ల తర్వాత అంటే అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో మరి.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)