2027 వరకు హెడ్‌ కోచ్‌గా అతడే.. సీఏ ప్రకటన

Published on Thu, 10/31/2024 - 09:37

ఆస్ట్రేలియా పురుషుల జట్టు హెడ్‌ కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌కు పొడిగింపు ఇచ్చారు. 2027 సీజన్‌ ముగిసేదాకా మెక్‌డొనాల్డే హెడ్‌ కోచ్‌గా కొనసాగుతాడని క్రికెట్‌ ఆ్రస్టేలియా (సీఏ) బుధవారం ప్రకటించింది. అంటే దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచకప్‌ దాకా మెక్‌డొనాల్డ్‌ ఆసీస్‌ జట్టుతో ఉంటాడు. జస్టిన్‌ లాంగర్‌ తప్పుకోవడంతో 2022లో మెక్‌డొనాల్డ్‌కు కోచింగ్‌ బాధ్యతలు అప్పగించారు.

డబ్ల్యూటీసీతో పాటు వన్డే వరల్డ్‌ కప్‌
మెక్‌డొనాల్డ్‌  కోచింగ్‌లోనే ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) సాధించింది. భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌లో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌నూ కైవసం చేసుకుంది. వన్డే ప్రపంచకప్‌ను నిలబెట్టుకునే లక్ష్యంతోనే ఆయన పదవీకాలాన్ని పొడిగించినట్లు తెలిసింది.

అందుకే పొడిగించాం
ఈ లోపే వచ్చే ఏడాది చాంపియన్స్‌ ట్రోఫీ కూడా ఉండటంతో మెక్‌డొనాల్డ్‌పై సీఏ మరోసారి నమ్మకం ఉంచింది. హెడ్‌ కోచ్‌గా మెక్‌డొనాల్డ్‌ ఇప్పటికే నిరూపించుకున్నాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈఓ నిక్‌ హాక్లీ అన్నారు. 

జట్టు నిలకడైన విజయాల్లో మెక్‌డొనాల్డ్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడని, దీంతో కోచింగ్‌ బృందాన్ని మరింత పటిష్ట పరిచేందుకే పొడిగింపు ఇచ్చామని హాక్లీ తెలిపారు. ఇక.. తనకు లభించిన పొడిగింపుపై హర్షం వ్యక్తం చేసిన మెక్‌డొనాల్డ్‌.. తనపై ఉంచిన నమ్మకాన్ని నిబద్ధతతో పూర్తి చేస్తానని చెప్పారు. 

చదవండి: IPL 2025: రిషభ్‌ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)