Breaking News

టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్‌

Published on Wed, 05/01/2024 - 10:04

వెస్టిండీస్‌, యూఎస్‌ఏ వేదికగా జూన్‌ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌‍కప్‌ 2024 కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. విధ్వంసకర వీరులతో నిండిన ఈ జట్టుకు మిచెల్‌ మార్ష్‌ సారథ్యం వహించనున్నాడు. ముందుగా ప్రచారం జరిగినట్లుగా స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. 

ఎలాగైనా జట్టులోకి వస్తాడనుకున్న ఐపీఎల్‌ విధ్వంసకర బ్యాటర్‌ జేక్‌ ఫ్రేసర్‌ మెక్‌గుర్క్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మాట్‌ షార్ట్‌, జేసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌, ఆరోన్‌ హార్డీ, స్పెన్సర్ జాన్సన్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌ లాంటి ఆశావహులకు కూడా మొండిచెయ్యే ఎదురైంది. చివరి వరల్డ్‌కప్‌ అని ముందుగానే ప్రకటించిన డేవిడ్‌ వార్నర్‌ను సెలెక్టర్లు కరుణించారు. 

ఎండ్‌ ఓవర్స్‌ స్పెషలిస్ట్‌ నాథన్‌ ఎల్లిస్‌ ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు. దాదాపు 18 నెలలుగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న ఆస్టన్‌ అగర్‌, కెమరూన్‌ గ్రీన్‌లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జోష్‌ ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయ వికెట్‌కీపర్‌గా మాథ్యూ వేడ్‌ జట్టులోకి వచ్చాడు.  పేస్‌  బౌలింగ్‌ త్రయం పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ కొనసాగనున్నారు. 

మిచ్‌ మార్ష్‌తో పాటు ట్రవిస్‌ హెడ్‌, టిమ్‌ డేవిడ్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌ ఆల్‌రౌండర్లుగా ఎంపికయ్యారు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కోటా ఆడమ్‌ జంపా జట్టులోకి వచ్చాడు. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ప్రయాణం జూన్‌ 5న మొదలవుతుంది. ఆసీస్‌ తమ తొలి మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో తలపడుతుంది. గ్రూప్‌-బిలో ఆసీస్‌.. ఇంగ్లండ్‌, నమీబియా, స్కాట్లాండ్‌, ఒమన్‌లతో పోటీపడుతుంది.

టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్‌ మార్ష్ (కెప్టెన్‌), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

 వరల్డ్‌కప్‌ విన్నర్లతో..
క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ వరల్డ్‌కప్‌ జట్టును వినూత్నంగా ప్రకటించింది. 2007 వన్డే వరల్డ్‌కప్‌ విన్నర్లు ఆసీస్‌ టీ20 వరల్డ్‌కప్‌ జట్టును అనౌన్స్‌ చేశారు. జట్టును ప్రకటించిన వారిలో దివంగత ఆండ్రూ సైమండ్స్‌ కొడుకు, కూతురు ఉండటం విశేషం.

 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)