Breaking News

‘క్రేజియెస్ట్‌ బిట్‌ ఆఫ్‌ క్రికెట్‌’.. ఇలాంటి ఫీల్డింగ్‌ నెవ్వర్‌ బిఫోర్‌!

Published on Sat, 03/16/2024 - 18:12

"Craziest Bit Of Cricket"- Video: హోరాహోరీ మ్యాచ్‌లో వైడ్‌ బాల్‌ను ఆపేందుకు ప్రయత్నించి వికెట్‌ కీపర్‌ విఫలమయ్యాడు. అతడి కాళ్ల మధ్య గుండా బౌండరీ లైన్‌ వైపు బంతి వెళ్తుండగా ఓ ఫీల్డర్‌ రంగంలోకి దిగాడు.

పాదరసంలా కదిలి సరిగ్గా బౌండరీ రోప్‌ను బాల్‌ తాకే ముందే ఆపేశాడు. వేగంగా పరిగెత్తుకురావడం మూలాన బ్యాలెన్స్‌ తప్పి అడ్వర్టైజ్‌మెంట్‌ బోర్డు వైపు వెళ్లి.. ఎగిరి అవతలకు దూకాడు. వెంటనే మళ్లీ వచ్చి బంతిని వికెట్‌ కీపర్‌ వైపు విసరాలని అనుకున్నాడు.

కానీ అప్పటికే వికెట్‌ కీపర్‌ బౌండరీ రోప్‌ వద్దకు పరిగెత్తుకు రాగా.. హడావుడిలో ఆ ఫీల్డర్‌ బంతిని చేజార్చుకున్నాడు. ఇంకేముంది బాల్‌ రోప్‌ అవతల పడింది. ఫలితంగా ప్రత్యర్థి జట్టు ఖాతాలో నాలుగు పరుగులు చేరాయి. ఆ ఫీల్డర్‌ చేసిన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది.

యూరోపియన్‌ క్రికెట్‌ లీగ్‌లో ఇండిపెండెంట్‌ క్రికెట్‌ క్లబ్‌- డొనాస్టడ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. డొనాస్టడ్‌ ఫీల్డర్‌ చేసిన ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘క్రేజియెస్ట్‌ బిట్‌ ఆఫ్‌ క్రికెట్‌’ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే..  తొలుత బ్యాటింగ్‌ చేసిన డొనాస్టడ్‌ జట్టు 10 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇండిపెండెంట్‌ క్రికెట్‌ క్లబ్‌ జట్టును 133/5కే కట్టడి చేసి 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఇదిలా ఉంటే.. భారత్‌లో ఇప్పటికే ఐపీఎల్‌ ఫీవర్‌ మొదలైంది. మార్చి 22న మొదలుకానున్న ఈ మెగా టీ20 లీగ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌-2024 తొలి దశలో భాగంగా 21 మ్యాచ్‌లు మాత్రమే నిర్వహించనున్న విషయం తెలిసిందే.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)