Breaking News

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు శుభారంభం.. రసవత్తరంగా సాగిన తొలి మ్యాచ్‌

Published on Fri, 08/30/2024 - 10:23

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌కు శుభారంభం లభించింది. ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్‌, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ చివరి బంతి వరకు రసవత్తరంగా సాగింది. ఈమ్యాచ్‌లో ఫాల్కన్స్‌పై పేట్రియాట్స్‌ వికెట్‌ తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌లో గెలుపుకు ఏడు పరుగులు అవసరం కాగా.. పేట్రియాట్స్‌  రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అన్రిచ్‌ నోర్జే చివరి బంతికి సింగిల్‌ తీసి పేట్రియాట్స్‌ను గెలిపించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఫాల్కన్స్‌.. జువెల్‌ ఆండ్రూ (50 నాటౌట్‌), ఫఖర్‌ జమాన్‌ (43) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కోఫి జేమ్స్‌ 22, ఫేబియన్‌ అలెన్‌ 24 (నాటౌట్‌), బిల్లింగ్స్‌ 18 పరుగులు చేశారు. పేట్రియాట్స్‌ బౌలర్లలో నోర్జే, డొమినిక్‌ డ్రేక్స్‌, అష్మెద్‌ నెడ్‌, షంషి తలో వికెట్‌ పడగొట్టారు.

164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందు​కు బరిలోకి దిగిన పేట్రియాట్స్‌.. 9 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. పేట్రియాట్స్‌ ఇన్నింగ్స్‌లో ఎవిన్‌ లెవిస్‌ (29), ఆండ్రీ ఫ్లెచర్‌ (25), కైల్‌ మేయర్స్‌ (39), ఓడియన్‌ స్మిత్‌ (27), డొమినిక్‌ డ్రేక్స్‌ (17) రెండంకెల స్కోర్లు చేశారు. షమార్‌ స్ప్రింగర్‌ నాలుగు వికెట్లు తీసి పేట్రియాట్స్‌ను భయపెట్టాడు. రోషన్‌ ప్రైమస్‌ 2, మొహమ్మద్‌ ఆమిర్‌, ఇమాద్‌ వసీం తలో వికెట్‌ పడగొట్టారు. రేపటి మ్యాచ్‌లో ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్‌, గయానా అమెజాన్‌ వారియర్స్‌ జట్లు తలపడనున్నాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)