Breaking News

సన్‌రైజర్స్‌ ఆటగాడు ఊచకోత.. కేవలం 22 బంతుల్లోనే!

Published on Sat, 08/12/2023 - 07:34

ది హాండ్రడ్‌ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్‌ జట్టు తమ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఈ లీగ్‌లో భాగం​గా నార్త్‌రన్‌ సూపర్ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఓవల్ ఇన్విన్సిబుల్స్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన  ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. 

కాక్స్‌, క్లాసెన్‌ మెరుపులు..
ఇన్విన్సిబుల్స్ బ్యాటర్లలో యువ ఆటగాడు జోర్డాన్‌ కాక్స్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కాక్స్‌ 38 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాక్స్‌తో పాటు దక్షిణాఫ్రికా ఆటగాడు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ ఆటగాడు హెన్రిస్‌ క్లాసెన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ​కేవలం  22 బంతుల్లోనే 6 సిక్స్‌లు సాయంతో 46 పరుగులు చేశాడు. నార్త్‌రన్‌ సూపర్ఛార్జర్స్‌ బౌలర్లలో పార్నెల్‌ రెండు వికెట్లు, అదిల్‌ రషీద్‌, టోప్లీ తలా వికెట్‌ సాధించారు.

పోరాడి ఓడిన సూపర్ఛార్జర్స్‌
186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ఛార్జర్స్‌ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్‌ టామ్‌ బాంటన్‌(43 బంతుల్లో 81 పరుగులు, 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ.. జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో గుస్ అట్కిన్సన్ మూడు వికెట్లు, సామ్‌ కుర్రాన్‌ రెండు, జాన్సన్‌, సునీల్‌ నరైన్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: మరో విజయంపై టీమిండియా గురి.. నేడే నాలుగో టీ20

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)