Breaking News

IPL 2024: 24 కోట్ల బౌలర్‌కు చుక్కలు చూపించిన క్లాసెన్‌..

Published on Sun, 03/24/2024 - 07:20

ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయిన ఆసీస్ స్టార్ పేస‌ర్‌, కోల్‌కతా నైట్ రైడ‌ర్స్  ప్రీమియ‌ర్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్లు చుక్క‌లు చూపించారు. ఐపీఎల్‌-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో స్టార్క్‌ను ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్లు ఓ ఆట ఆడేసికున్నారు. 

ముఖ్యంగా స‌న్‌రైజ‌ర్స్ స్టార్ హెన్రిస్ క్లాసెన్ అయితే స్టార్క్‌ను ఊచ‌కోత కోశాడు. ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ 19 ఓవ‌ర్ వేసిన స్టార్క్ ఏకంగా 26 ప‌రుగులు స‌మ‌ర్పించకున్నాడు. ఆ ఓవ‌ర్‌లో మొత్తం నాలుగు సిక్స్‌లు బాదారు. అందులో క్లాసెన్ 3 సిక్స్‌లు కొట్ట‌గా.. షబాజ్ అహ్మ‌ద్ ఓ సిక్స్ బాదాడు. ఈ మ్యాచ్‌లో స్టార్క్ త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో వికెట్ ఏమీ తీయ‌కుండా ఏకంగా 53 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రూ.24.75 కోట్ల భారీ ధరకు స్టార్క్‌ను కేకేఆర్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో దారుణ ప్రదర్శన కనబరిచిన  స్టార్క్‌ను నెటిజన్లు దారుణంగా విఫలమవుతున్నారు. తన కంటే రూ.20 లక్షల తీసుకున్న హర్షిత్ రానా ఎంతో బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ మ్యాచ్లో రానా మూడు వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఆఖరి ఓవర్‌లో అద్బుతం‍గా బౌలింగ్ చేసి తన జట్టుకు విజయాన్ని అందిచాడు. ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైంది.  హెన్రిస్ క్లాసెన్ 63 ప‌రుగుల‌తో విరోచిత పోరాటం చేసిన‌ప్ప‌టికి త‌న జ‌ట్టును గెలిపించలేక‌పోయాడు. 
 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు