Breaking News

మీరాబాయి మెరిసేనా!

Published on Mon, 08/25/2025 - 00:59

అహ్మదాబాద్‌: ఏడాది విరామం తర్వాత భారత స్టార్‌ లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత మీరాబాయి చాను పోటీల బరిలోకి దిగుతోంది. నేటి నుంచి ఇక్కడ జరిగే కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆమె స్టార్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ కానుంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో కేవలం ఒక కిలోగ్రామ్‌ తేడాతో పోడియంలో నిలువలేకపోయిన మీరాబాయి తర్వాత గాయాల బారిన పడింది. దీంతో చాలా టోర్నీలకు ఆమె దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా పతకం పట్టుపట్టేందుకు 32 ఏళ్ల మీరా 48 కేజీల కేటగిరీకి మారింది. 

లాస్‌ ఏంజెలిస్‌ 2028 ఒలింపిక్స్‌లో ఆమె రెగ్యులర్‌ కేటగిరీ కాకుండా 48 కేజీల కేటగిరీ ఉండటంతో ఇప్పటి నుంచే ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌కు ఈ తాజా చాంపియన్‌షిప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ కావడంతో మీరాబాయి సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆమెతో పాటు కామన్వెల్త్‌ క్రీడల రజత విజేత బింద్యారాణి దేవి, కాంస్య విజేతలు హర్జిందర్‌ కౌర్, లవ్‌ప్రీత్‌ సింగ్‌లు సహా భారత లిఫ్టర్లే ఈ టోర్నీలో ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. 

భారత జట్ల వివరాలు: 
మహిళలు: మీరాబాయి చాను (48 కేజీలు), స్నేహా సోరెన్‌ (53 కేజీలు), బింద్యారాణి (58 కేజీలు), నిరుపమా (63 కేజీలు), హర్జిందర్‌ కౌర్‌ (69 కేజీలు), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (77 కేజీలు), వన్షిత (86 కేజీలు), మెహక్‌ (+86 కేజీలు). పురుషులు: రిషికాంత సింగ్‌ (60 కేజీలు), 
ఎం.రాజా (65 కేజీలు), నారాయణ అజిత్‌ (71 కేజీలు), వల్లూరి అజయ్‌ బాబు (79 కేజీలు), అజయ్‌ సింగ్‌ (88 కేజీలు), దిల్బాగ్‌ సింగ్‌ (94 కేజీలు), హర్‌చరణ్‌ సింగ్‌ (110 కేజీలు), లవ్‌ప్రీత్‌ సింగ్‌ (+110 కేజీలు).   

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)