Breaking News

ఎడ్జ్‌బాస్టన్‌ పిచ్‌ హైవేలా ఉంది.. జాఫర్‌ సెటైరికల్‌ ట్వీట్‌

Published on Sat, 06/17/2023 - 18:20

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌ తొలి టెస్టులో ఇంగ్లండ్‌ ఆధిపాత్యం చెలాయిస్తోంది. బాజ్‌బాల్‌ అంటూ దూకుడుగా ఆడి తొలి ఇన్నింగ్స్‌ను 393/8 వద్ద డిక్లెర్‌ చేసిన ఇంగ్లీష్‌ జట్టు.. బౌలింగ్‌లో కూడా అదే తీరును కనబరుస్తుంది. ఇంగ్లండ్‌ బౌలర్ల దెబ్బకు రెండో రోజు లంచ్‌ సమయానికి మూడు కీలక వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఇప్పటికే పెవిలియన్‌కు చేరారు.

ఇక ఈ విషయం పక్కన పెడితే.. తొలి టెస్టు జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్‌ పిచ్‌ను చాలా  ఫ్లాట్‌గా తాయారు చేశారని, బౌలర్లకు ఏ మాత్రం అనుకూలించడం లేదని పలువురు మాజీ క్రికెటర్‌లు విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ తనదైన స్టైల్‌లో స్పందించాడు. ఎడ్జ్‌బాస్టన్‌ పిచ్‌ను హైవేతో పోలుస్తూ జాఫర్‌ సెటైరికల్‌ ట్వీట్‌ చేశాడు.

ఎడ్జ్‌బాస్టన్‌ పిచ్‌ ఫోటోను షేర్‌చేస్తూ.. "పిచ్‌ను దగ్గరగా చూడండి అంటూ" ట్విటర్‌లో రాసుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్‌ (118 నాటౌట్‌) అద్భుతమైన శతకంతో చెలరేగగా.. . జాక్‌ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ లయోన్‌ 4, హాజిల్‌వుడ్‌ 2, బోలండ్‌, గ్రీన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.
చదవండిAshes Series 1st Test: స్మిత్‌ భరతం పట్టిన స్టోక్స్‌

Videos

సభలో అందరిముందు జనసేన గాలి తీసిన బాబు..

Idupulapaya: YSR ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు

Nepal Floods: ప్రియ అధికారి ఎవరు? 6 రోజులు.. 100 మిషన్లు..

లండన్ లో త్రిష.. విజయ్ వెళ్ళేది ఆమె కోసమేనా!

టైల్స్ పై పడుకొని కెమెరా కెమెరా మెన్ లకు నమస్కారం

YSR ఘాట్ వద్ద వైఎస్ జగన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు

AP: 20 ఏళ్ల పగ.. వేటాడి వెంటాడి హత్య

కొట్టుకుపోతున్న పాకిస్థాన్ ఇస్లామాబాద్ ను ముంచెత్తిన వరదలు

అడిగి అడిగి అలసిపోయాం.. అందుకే పోరాటంలోకి దిగాం

ఇంజన్ ఫెయిల్.. ఇండిగో ఫ్లైట్ కు తప్పిన ఘోర ప్రమాదం

Photos

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)