Breaking News

ఫ్యాన్స్‌కు ఇక పండగే.. క్రిస్‌ గేల్‌ రీ ఎంట్రీ! తెలంగాణ కెప్టెన్‌గా

Published on Fri, 02/09/2024 - 10:31

వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ మరోసారి మెరుపులు మెరిపించేందుకు సిద్దమయ్యాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో తెలంగాణ టైగ‌ర్స్ జ‌ట్టుకు క్రిస్ గేల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించనున్నాడు. ఈ విషయాన్ని ‍క్రిస్‌ గేల్‌ స్వయంగా వెల్లడించాడు. ఫిబ్ర‌వ‌రి 23 నుంచి మార్చి 3 వ‌ర‌కు తొమ్మిది రోజుల పాటు డెహ్ర‌డూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈ టోర్నీ జ‌రుగ‌నుంది.

"నాపై నాకున్న నమ్మకం, అభిమానుల హర్ష ద్వనిలు నన్ను మళ్లీ బ్యాట్‌ పట్టేలా చేస్తున్నాయి. వెటరన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మీ యూనివర్సల్ బాస్ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. దిగ్గజ ఆటగాళ్లలతో మళ్లీ ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌.. ఐవీపీఎల్‌కు సిద్దమవ్వండి" అంటూ గేల్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.  గేల్‌తో పాటు భారత మాజీ క్రికెటర్లు సుదీప్ త్యాగీ, మన్‌ప్రీత్ గోనీ, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రికార్డో పోవెల్‌ తెలంగాణ టైగర్స్ తరఫున బరిలోకి దిగనున్నారు.  

మొత్తం ఎన్ని జట్లు అంటే?
ఈ లీగ్‌లో మొత్తం ఆరు జ‌ట్లు భాగం కానున్నాయి. వీవీఐపీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, తెలంగాణ టైగ‌ర్స్‌, రాజ‌స్థాన్ లెజెండ్స్‌, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛ‌త్తీస్‌గ‌ఢ్ వారియ‌ర్స్‌, ముంబై ఛాంపియ‌న్స్ జట్లు ఈ వెటరన్‌ లీగ్‌లో అమీతుమీ తెల్చుకోనున్నాయి.

 ఈ టీ20 లీగ్‌ను డీడీ స్పోర్ట్స్‌తో పాటు యూరోస్పోర్ట‌స్ ఛానెల్‌లో అభిమానులు వీక్షించవచ్చు. కాగా వీరేంద్ర సెహ్వాగ్, మునాఫ్ పటేల్, సురేశ్ రైనా, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్, యూసఫ్ పఠాన్, హెర్షల్ గిబ్స్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీలో భాగం కానున్నట్లు సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)