Breaking News

ఐదులో నాలుగు చైనాకే...

Published on Mon, 07/28/2025 - 04:24

చాంగ్జౌ: బ్యాడ్మింటన్‌ సీజన్‌లోని చివరి వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ చైనా ఓపెన్‌లో చైనా క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మొత్తం ఐదు విభాగాలకుగాను నాలుగు విభాగాల్లో టైటిల్స్‌ దక్కించుకున్నారు. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో చైనా క్రీడాకారులే ఫైనల్‌ చేరుకున్నారు. ఫలితంగా విన్నర్స్, రన్నరప్‌గా చైనా ప్లేయర్లే నిలిచారు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ షి యు కి (చైనా) 64 నిమిషాల్లో 14–21, 21–14, 21–15తో ప్రపంచ 23వ ర్యాంకర్‌ వాంగ్‌ జెంగ్‌ జింగ్‌ (చైనా)పై గెలిచాడు.

మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ వాంగ్‌ జి యి (చైనా) 39 నిమిషాల్లో 21–8, 21–13తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ హాన్‌ యువె (చైనా)పై విజయం సాధించింది. మహిళల డబుల్స్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ జోడీ లియు షెంగ్‌ షు–టాన్‌ నింగ్‌ (చైనా) 69 నిమిషాల్లో 24–22, 17–21, 21–14తో ప్రపంచ ఏడో ర్యాంక్‌ జాంగ్‌ షు జియాన్‌–జియా యి ఫాన్‌ (చైనా) ద్వయంపై నెగ్గింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ జంట ఫెంగ్‌ యాన్‌ జె–హువాంగ్‌ డాంగ్‌ పింగ్‌ 47 నిమిషాల్లో 23–21, 21–17తో ప్రపంచ రెండో ర్యాంక్‌ జోడీ జియాంగ్‌ జెన్‌ బాంగ్‌–వె యా జిన్‌ (చైనా)పై గెలుపొందింది. 

పురుషుల డబుల్స్‌ విభాగంలో ప్రపంచ 210వ ర్యాంక్‌ జోడీ ఫజర్‌ అల్ఫీయాన్‌–మొహమ్మద్‌ షోహిబుల్‌ ఫిక్రీ (ఇండోనేసియా) ద్వయం 21–15, 21–14తో ప్రపంచ రెండో ర్యాంక్‌ జోడీ ఆరోన్‌ చియా–సో వుయ్‌ యిక్‌ (మలేసియా)పై సంచలన విజయం సాధించి టైటిల్‌ను దక్కించుకుంది. పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలకు 1,40,000 డాలర్ల చొప్పున (రూ. 1 కోటీ 21 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 12,000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విజేత జోడీలకు 1,48,000 డాలర్ల చొప్పున (రూ. 1 కోటీ 28 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 12,000 ర్యాంకింగ్‌ పాయింట్లు దక్కాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)