Breaking News

డైవింగ్‌లో చైనా క్లీన్‌స్వీప్‌

Published on Sun, 08/11/2024 - 04:37

పారిస్‌ ఒలింపిక్స్‌ డైవింగ్‌ క్రీడాంశంలో చైనా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. అక్వాటిక్‌ సెంటర్‌లో అద్భుతాలు చేసిన చైనా డైవర్లు రికార్డు స్థాయిలో ఎనిమిది స్వర్ణాలతో ఈ విభాగంలో అందుబాటులో ఉన్న అన్ని పసిడి పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. శనివారం పురుషుల 10 మీటర్ల ప్లాట్‌ఫామ్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ ఒలింపిక్‌ చాంపియన్‌ కావో యున్‌ (చైనా) 547.50 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌ దక్కించుకున్నాడు. 

తద్వారా ఒలింపిక్స్‌ డైవింగ్‌లో 1988 తర్వాత స్వర్ణం నిలబెట్టుకున్న మొదటి స్విమ్మర్‌గా కావో యున్‌ నిలిచాడు. అమెరికాకు చెందిన గ్రెగ్‌ లుగానిస్‌ 1984 లాస్‌ ఏంజెలెస్, 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో పసిడి పతకాలు నెగ్గాడు. తమాయి రికుటో (జపాన్‌; 507.65 పాయింట్లు), విలియమ్స్‌ నోహ్‌ (గ్రేట్‌ బ్రిటన్‌; 497.35 పాయింట్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. గతంలో ఎనిమిదింట ఏడు పతకాలు నెగ్గిన చైనా... ఈసారి మాత్రం క్లీన్‌స్వీప్‌ చేసింది. 

‘పారిస్‌’ క్రీడల్లో డైవింగ్‌ విభాగంలో జరిగిన మహిళల 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, పురుషుల 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, మహిళల 10 మీటర్ల ప్లాట్‌ఫామ్, పురుషుల సింక్రనైజ్డ్‌ 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, మహిళల సింక్రనైజ్డ్‌ 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, మహిళల సింక్రనైజ్డ్‌ 10 మీటర్ల ప్లాట్‌ఫామ్, పురుషుల సింక్రనైజ్డ్‌ 10 మీటర్ల ప్లాట్‌ఫామ్‌ పోటీల్లో చైనా స్విమ్మర్లు అగ్రస్థానాల్లో నిలిచి పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. చైనా డైవర్లు ఈ ఎనిమిది విభాగాల్లో స్వర్ణాలే కాకుండా.. మరో రెండు రజతాలు, ఒక కాంస్యం కూడా గెలిచి మొత్తంగా డైవింగ్‌లోనే 11 పతకాలు పట్టారు.  

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)