Breaking News

పుజారా ఆల్‌టైమ్ భార‌త జ‌ట్టు ఇదే.. రోహిత్‌, పంత్‌కు నో ఛాన్స్‌?

Published on Fri, 05/23/2025 - 18:13

భార‌త టెస్టు క్రికెట్ హిస్టరీలో వెట‌రన్ ఆట‌గాడు చతేశ్వర్ పుజారా త‌నకంటూ ప్ర‌త్యేక పేజీని లిఖించుకున్నాడు. త‌న అద్బుత బ్యాటింగ్‌తో టీమిండియా నయా వాల్‌గా పేరు గాంచాడు. అయితే ఫామ్ లేమితో స‌త‌మ‌త‌వుతున్న పుజారా కొంత కాలంగా భార‌త జ‌ట్టుకు దూరంగా ఉటున్నాడు.

ఈ మ‌ధ్య కాలంలో కామెంటేర్‌గా కూడా పుజారా అవతార‌మెత్తాడు. ఇప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కొనసాగుతున్న ఈ సౌరాష్ట్ర ఆటగాడు.. భారత సెలక్టర్ల నుంచి పిలుపు వస్తే రీ ఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా స్పోర్ట్స్ తక్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుజారా తన ఆల్ టైమ్ ఇండియా టెస్ట్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు.

చతేశ్వర్ త‌న ఎంచుకున్న జ‌ట్టులో ఓపెన‌ర్ల‌గా దిగ్గ‌జ క్రికెట‌ర్లు సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల‌కు అవ‌కాశ‌మిచ్చాడు. అయితే పుజారా మూడో స్ధానంలో త‌న‌కు కాకుండా ది గ్రేట్ వాల్ రాహుల్ ద్ర‌విడ్‌కు చోటు ఇచ్చాడు. నాలుగు, ఐదు స్ధానాల్లో వ‌రుస‌గా స‌చిన్ టెండూల్క‌ర్‌, విరాట్ కోహ్లిల‌కు ఛాన్స్ ద‌క్కింది.

ఆరో స్దానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను పుజారా ఎంపిక చేశాడు. ఇక వికెట్ కీప‌ర్‌గా పంత్‌కు కాకుండా లెజెండ‌రీ ఎంఎస్ ధోని అత‌డు సెల‌క్ట్ చేశాడు. స్పిన్న‌ర్లగా అనిల్ కుంబ్లే, అశ్విన్‌.. ఫాస్ట్ బౌల‌ర్ల‌గా జ‌స్ప్రీత్ బుమ్రా, క‌పిల్ దేవ్‌ల‌కు పుజారా చోటిచ్చాడు. కాగా పుజారా ఎంపిక చేసిన జ‌ట్టులో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, గ్రేట్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాల‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

పుజారా ఆల్-టైమ్ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌: సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోనీ (వికెట్‌కీపర్‌), అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్ మరియు జస్ప్రీత్ బుమ్రా.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)