Breaking News

'చీటింగ్‌ చేసేవాడితో ఆడలేను.. అందుకే తప్పుకున్నా'

Published on Tue, 09/27/2022 - 17:17

వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్.. నార్వే గ్రాండ్‌మాస్టర్‌ మాగ్నస్‌ కార్ల్‌స‌న్ ప్రత్యర్థి చెస్‌ ఆటగాడు నీమ్యాన్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ప్రత్యర్థి హ‌న్స్ నీమ్యాన్ ప‌దే ప‌దే చీటింగ్‌కు పాల్పడిన‌ట్లు కార్ల్‌స‌న్ ఆరోపించాడు. విషయంలోకి వెళితే.. శనివారం జూలియస్‌ బేర్‌ జనరేషన్‌ కప్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో కార్లసన్‌ మరోసారి నీమ్యాన్‌తో తలపడ్డాడు.

ఒక ఎత్తు వేసిన వెంటనే కార్ల్‌సన్‌ ఆట నుంచి తప్పుకున్నాడు. ఇది అక్కడున్న వారందరిని షాక్‌కు గురి చేసింది. అయితే తాను తప్పుకోవడంపై కార్ల్‌సన్‌ త‌న ట్విటర్‌లో స్పందించాడు. కార్ల్‌సన్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పాటు ఇటీవలే ముగిసిన సిన్‌క్యూఫీల్డ్ క‌ప్ నుంచి వైదొలడంపై కార్ల్‌సన్‌ వివరణ ఇచ్చాడు.

''సిన్‌క్యూఫీల్డ్‌ కప్‌ నుంచి పక్కకు తప్పుకోడానికి ఒక కారణం ఉంది. నీమ్యాన్‌ ఆ మ్యాచ్‌లో చీటింగ్‌కు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అతనే ఇటీవలే ఒప్పుకున్నాడు. అలాంటి ప్లేయ‌ర్‌తో ఆడ‌లేను.ఆన్‌లైన్‌లోనే కాదు.. బోర్డ్ ప్లేలో కూడా నీమ్యాన్ చీటింగ్ చేశాడు. జూలియస్‌ బేర్‌ జనరేషన్‌ కప్‌లో అతనితో మరోసారి ఎదురుపడాల్సి వచ్చింది. కానీ పదే పదే చీటింగ్‌ చేసే ఆటగాడితో నేను ఆడలేను అందుకే తప్పుకున్నా.'' అంటూ పేర్కొన్నాడు.

ఇటీవ‌ల సెయింట్ లూయిస్‌లో జరిగిన ఓ టోర్న‌మెంట్‌లో నీమ్యాన్ చేతిలో కార్ల్‌స‌న్ ఓట‌మి పాల‌య్యాడు. వ‌ర‌ల్డ్ చాంపియ‌న్  ఆ టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. అయితే కేవ‌లం త‌న కెరీర్‌ను దెబ్బ తీసేందుకు త‌న‌పై కార్ల్‌స‌న్ చీటింగ్ ఆరోప‌ణ‌లు చేస్తున్నట్లు నీమ్యాన్ ఆరోపించాడు. ఇక ఆదివారం జరిగిన జూలియస్‌ బేర్‌ జనరేషన్‌ కప్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ విజేతగా అవతరించాడు. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిశేషి అర్జున్‌పై రెండు ఫైనల్స్‌లోనూ కార్ల్‌సన్‌  2.5–0.5; 2–0 తేడాతో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

చదవండి: సిరీస్‌ క్లీన్‌స్వీప్‌.. పీపీఈ కిట్లతో క్రికెటర్ల క్యాట్‌వాక్‌

స్టార్‌ క్రికెటర్‌ కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు

Videos

కలర్ ఫుల్ బ్యూటీస్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నరాలు తెగే హైప్ ఇచ్చిన హృతిక్ రోషన్

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య ఎమోషనల్..

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

రేపట్నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం

Liquor Case: రాజకీయ కక్ష అని తేలితే...? సుప్రీం సీరియస్

Miss World 2025: అందం అంటే..!

మాట నిలబెట్టుకున్న జగన్.. ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల చెక్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ రిప్లై

సమంత లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్?

Photos

+5

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' హీరో క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

Subham Success Meet : శుభం సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)

+5

'వచ్చినవాడు గౌతమ్‌' సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

సుందరీమణుల మనస్సు దోచిన 'పోచంపల్లి చీరలు'..ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)

+5

సరస్వతి పుష్కరాలు.. కాళేశ్వరంలో సీఎం రేవంత్‌ పర్యటన (ఫొటోలు)

+5

Miss World 2025 : యాదగిరిగుట్ట, పోచంపల్లిలో మిస్‌ వరల్డ్‌ బ్యూటీస్‌ సందడి (ఫొటోలు)

+5

బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)

+5

డ్యాన్సింగ్‌ క్వీన్‌ 'మాధురీ దీక్షిత్‌' బర్త్‌డే.. ఈ విషయాలు తెలుసా?

+5

నిఖిల్‌ సిద్ధార్థ్ పెళ్లికి ఐదేళ్లు.. భార్యకు స్పెషల్ విషెస్ (ఫొటోలు)