Breaking News

విజేత కార్ల్‌సన్‌... అర్జున్‌కు నాలుగో స్థానం

Published on Sun, 08/03/2025 - 13:45

రియాద్‌: తొలిసారి నిర్వహించిన ఈ–స్పోర్ట్స్‌ వరల్డ్‌కప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ చాంపియన్‌గా అవతరించాడు. అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్‌)తో జరిగిన ఫైనల్లో కార్ల్‌సన్‌ 3–1, 3–1తో విజయం సాధించాడు.

సెట్‌–1లో భాగంగా జరిగిన నాలుగు గేముల్లో కార్ల్‌సన్‌ రెండు గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. సెట్‌–2లో భాగంగా జరిగిన నాలుగు గేముల్లో కార్ల్‌సన్‌ మూడు గేముల్లో నెగ్గి, ఒక గేమ్‌లో ఓడిపోయాడు. హికారు నకముర (అమెరికా) మూడో స్థానం పొందగా... భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ స్టార్‌ ఇరిగేశి అర్జున్‌ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.

నకమురతో జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో అర్జున్‌ 2.5–3.5తో ఓడిపోయాడు. ఐదు గేముల్లో అర్జున్‌ రెండింటిలో గెలిచి, ఒక దానిని ‘డ్రా’ చేసుకున్నాడు.  విజేతగా నిలిచిన కార్ల్‌సన్‌కు 2,50,000 డాలర్లు (రూ. 2 కోట్ల 18 లక్షలు) లభిస్తాయి.

రెండో స్థానం పొందిన అలీరెజాకు 1,90,000 డాలర్లు (రూ. 1 కోటీ 65 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన నకమురకు 1,45,000 డాలర్లు (రూ. 1 కోటీ 26 లక్షలు), నాలుగో స్థానంలో నిలిచిన అర్జున్‌కు 1,15,000 డాలర్లు (రూ. 1 కోటీ 33 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)